
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- కార్తీకమాసం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు దేవాలయాలకు వెళ్తున్న సందర్భంలో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో కాశీ బుగ్గ దేవాలయంలో తొక్కిసలాట జరగగా దాదాపు 9 మందికి పైగా మృతి చెందడం మరి కొంతమంది గాయాలు పాలవడం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఇలాంటి తొక్కిసలాటలు దేవాలయాల్లో మరోసారి జరగకుండా అధికారులతో పాటు భక్తులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తులు విపరీతంగా దర్శనాలకు వచ్చే అవకాశాలు ఉండడంతో.. అధికారులు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఆలయాల్లో భక్తుల రద్దీ.. అధికారుల సూచనలు ఇవే :-
1. క్యూ లైన్ లో ఉన్నప్పుడు వ్యతిరేక దిశలో ప్రవేశించకూడదు
2. ముందున్న భక్తులను నెట్టకూడదు
3. పరుగు తీయడం లాంటివి లేదా తోసుకోవడం లాంటివి చేయకూడదు
4. ఆలయ సిబ్బంది అధికారుల సూచనలు పాటించాలి
5. గుంపులు గుంపులుగా నడవద్దు
6. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశం లో దర్శనం కోసం సహనంతో వేచి ఉండాలి
7. తొక్కిసలాట పరిస్థితులు కనిపించగానే దూరంగా వెళ్లిపోవాలి
8. స్వామి వారిని చూసి వెంటనే ముందుకు వెళ్లిపోవాలి
9. ప్రసాదాల కోసం తోపులాట చేసుకోకూడదు
10. దర్శనం అయిన వెంటనే మీ ఇంటికి పయనం అవ్వాలి.
Read also : గెలిచిన మహిళలకు బహుమతిగా వజ్రాల ఆభరణాలు!
Read also : Paddy Procurement: ఓవైపు వానలు.. మరోవైపు మిల్లర్ల అలసత్వం.. అన్నదాతల అరిగోస!





