
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీస్ దశకు చేరింది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో సెమిస్ చేరిన జట్లు ఖరారయ్యాయి. ఇక గ్రూపు బి లో 5 పాయింట్లుతో దక్షిణాఫ్రికా తొలి స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఇక నేడు న్యూజిలాండ్ మరియు భారతదేశం మధ్య మ్యాచ్ ఫలితంతో గ్రూప్ ఏ టేబుల్ టాపర్ తేలనుంది. కాబట్టి ఇవాళ జరగబోయే మ్యాచ్లో టీమిండియా గెలిస్తే గ్రూప్ ఏ నుంచి మొదటి స్థానంలో ఉంటుంది. ఇక ఇవ్వాళ జరిగే మ్యాచ్లో ఓడిన జట్టు దక్షిణాఫ్రికా తో తలపడునుండగా గెలిచిన జట్టు ఆస్ట్రేలియాతో పోటీపడునుంది.
సొంత పార్టీ ఏర్పాటా?… పక్క పార్టీలో చేరడమా ?? తీన్మార్ మల్లన్న ముందున్న దారి ఏమిటి???
కాగా ఎన్నో అంచనాల మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఊహించని ఫలితాలు ఏర్పడ్డాయి. పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్లు జరగగా పాకిస్తాన్ ఒక మ్యాచ్ కూడా నెగ్గలేదు. అలాగే మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ కూడా సెమిస్ దశకు చేరలేకపోయాయి. దీంతో అందరూ ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా, టీమిండియా, సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ టీములు సెమిస్లోకి అడుగుపెట్టాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సెమిస్ లో గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి ఇంకా రసవత్తరంగా మ్యాచులు సాగేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు కప్పు గెలవని సౌతాఫ్రికా ఈసారి కప్పు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా అంతే బలంగా ఉంది. ఇక ఆస్ట్రేలియా మరియు ఇండియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రెండు టీంలలో కచ్చితంగా ఒకటి ఫైనల్ చేరుతుంది. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు దక్కించుకుంటారు అనేది ఆసక్తికరంగా మారిపోయింది. కాబట్టి ప్రతిరోజు మ్యాచ్ కూడా చాలా ఉత్కంఠంగా సాగబోతుంది.
కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ క్లాస్… స్పందిస్తూ సీఎంపై సెటైర్లు వేసిన కేటీఆర్