క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్ బీ సెక్షన్‌లో తనిఖీలు చేశారు. సెక్రటేరియట్‌లో ఉద్యోగుల పనితీరు గురించి తెలుసుకోడానికి వెళ్లిన మంత్రి.. అక్కడ పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. ఆర్ అండ్ బీ సెక్షన్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయనకు.. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సమయం దాటిపోయినా చాలా మంది ఉద్యోగులు ఆఫీసుకు రాకపోవడంతో మంత్రి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాధారణంగా ఉద్యోగులు ఉదయం 10 గంటలకు కార్యాలయాలకు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ, సెక్రటేరియట్ ఉద్యోగులు మాత్రం 11 గంటలైనా రాకపోవడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. 11 అయినా రాలేదు.. మళ్లీ 6గంటలకు వెళ్లిపోతారు.. మధ్యలో ఆఫ్ అంటూ మంత్రి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతోపాటు పలు వివరాలను మంత్రి కోమటిరెడ్డి అడిగి తెలుసుకున్నారు.. కొన్ని విషయాలపై అధికారులు స్పందించకపోవడంతో మీ వివరాలు మీకు కూడా తెలియదా అంటూ ఫైర్ అయ్యారు. ఇకపై ఉద్యోగులు సమయపాలన పాటించాలని.. ఇలా అయితే కుదరదంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
- మియాపూర్‌లో దారుణం.. యువతిపై ఇద్దరు అత్యాచారయత్నం, కేసు నమోదు!!
- పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు.. బీఎన్‌ఎస్ యాక్ట్‌లో కేసు నమోదైన తొలి ఎమ్మెల్యేగా రికార్డు!!
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. మరోసారి ఎమ్మెల్సీ కవితకు కస్టడీ పొడగింపు!!
- నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్న కేకే.. కాంగ్రెస్ పార్టీలో చేరిక!!
- నగరంలో కిడ్నాప్ గ్యాంగ్‌ల కలకలం.. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులైన వారి పిల్లలే టార్గెట్!!