తెలంగాణ

సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు నేలమట్టం! హైడ్రా సంచలనం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జా చేసి ఇండ్లు కట్టుకున్న అక్రమార్కుల భరతం పడుతున్న హైడ్రా మరో పెను సంచలనం చేసింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి ఇంటికి నోటీసులు ఇచ్చింది. మాదాపూర్‌ అమర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు, కార్యాలయం దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు అధికారులు ఆ నోటీసుల్లో తెలిపారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేశారు రెవెన్యూ అధికారులు. అందుకు 30 రోజుల గడువు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడితో పాటు కావూరి హిల్స్ లో నిర్మించి 225 ఇండ్లకు శేరిలింగంపల్లి రెవన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. కావూరి హిల్స్ లో కట్టిన భవనాలన్ని దుర్గం చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నట్లు రెవిన్యూ అధికారులు గుర్తించారు.

తన ఇంటికి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసుపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. శేరిలింగం పల్లి రెవిన్యూ అధికారులు తనకు నోటీస్ ఇచ్చారని చెప్పారు. 2015లో అమర్ సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేశానన్నారు. తాను ఆ ఇంటిని కొన్నప్పుడు చెరువు FTLలో పరిధిలో ఉందన్న సమాచారం తనకు లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం FTLలో ఉన్న భూములపై చర్యలు తీసుకున్న నేపథ్యం..తన భవనంపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యతరం లేద్ననారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి.

ఎఫ్‌టీఎల్, బఫర్‌‌జోన్‌లో ఆక్రమల కూల్చివేతల విషయంలో హైడ్రా దూకుడుకు అక్రమార్కులు వెన్నులో వణుకుపుడుతోంది. ఎప్పుడు ఎవరి భవనం ముందు బుల్డోజర్లు వస్తాయోనని షేకవుతున్నారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్ని ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఉన్న నిర్మాణాలు ఎవరివైనా సరే కూల్చివేస్తామని ఆయన తేల్చిచెప్పారు.
30 ఏళ్ల కిందట నిర్మించిన కట్టడాలైనా ఆక్రమణల్లో ఉన్నాయని తేలితే చర్యలు తప్పవన్నారు.

Back to top button