క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాదులోని జవహర్ నగర్ లో 18 నెలల చిన్నారి వీధి కుక్కల దాడిలో మృతి చెందిన ఘటన తనని ఎంతగానో కలిచి వేసిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. వీధి కుక్కల దాడుల పై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. పశువైద్యలతో,బ్లూ క్రాస్ వంటి సంస్థల ప్రతినిధులతో మాట్లాడి కమిటీ వేయాలన్నారు. కాగా రాష్ట్రంలో రోజురోజుకు వీధి కుక్కల స్వైర విహారం పెరుగుతూ పోతుంది. పల్లె నుంచి పట్నం వరకు ఒకే సమస్య ఉంది. రోడ్ల వెంట నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉండటం లేదు. ఎట్టకేలకు సీఎం ఈ సమస్యపై దృష్టి సాధించారు.
96,465 Less than a minute