Uncategorized

విజయవాడలో లక్ష మందిని గోడ!జగన్‌కు జైకొట్టిన కృష్ణ లంక

విజయవాడను వరద ముంచేసింది. గ‌త 50 ఏళ్ల‌లో ఎప్పుడూ లేనంతగా కుండపోతగా వర్షం కురవడంతో వరద ఊహించని స్థాయిలో వచ్చింది.విజయవాడ నగరం దాదాపుగా నీట మునిగింది. దాదాపు 80 శాతం గ్రామాలు జలమలమయ్యాయని సీఎం చంద్రబాబే ప్రకటించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. వర్షం తగ్గి మూడు రోజులైనా ఇంకా 50 శాతం గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. కృష్ణమ్మకు రికార్టు స్థాయిలో వరద వచ్చింది. 12 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో విజయవాడ అతలాకుతలం అయింది. విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్తుతున్న నేప‌థ్యంలో ఆ ర‌క్ష‌ణ గోడే లేక‌పోయి వుంటే… విప‌త్తును ఊహించ‌లేమ‌ని ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు. ఆ రక్షణ గోడతో దాదాపు లక్ష మంది సేఫ్ అయ్యారనే టాక్ వస్తోంది.

ప్రకాశం బ్యారేజీకి 3 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద‌ వస్తేనే కృష్ణా ప‌రివాహ‌క ప్రాంతాలు నీట మునిగేవి. ప్ర‌కాశం బ్యారేజీ గేట్లు ఎత్త‌డానికి ముందు కృష్ణాన‌ది ప‌రివాహ‌క ప్రాంత‌వాసుల్ని ఖాళీ చేయించి పున‌రావాస ప్రాంతాల‌కు పంపేవాళ్లు. జ‌గ‌న్ హ‌యాంలో కృష్ణా న‌ది వెంబ‌డి ప‌ద్మావ‌తి ఘాట్ నుంచి య‌న‌మ‌ల‌కుదురు వ‌ర‌కూ మూడు విడ‌త‌ల్లో 5.66 కిలోమీట‌ర్ల మేర ర‌క్ష‌ణ గోడ‌ను బ‌లంగా నిర్మించారు. ఇందుకోసం రూ.474 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేశారు. ఆ గోడే ఇప్పుడు లక్షమందిని కాపాడిందని చెబుతున్నారు.

గతంలో మూడు ల‌క్షల క్యూసెక్కుల నీళ్లు ప్ర‌కాశం బ్యారేజీలో వస్తే కృష్ణాన‌ది ప‌రివాహ‌క ప్రాంతాలైన కృష్ణ‌లంక‌, రాణిగారితోటతోట‌, రామ‌లింగేశ్వ‌ర‌న‌గ‌ర్‌, గౌత‌మిన‌గ‌ర్‌, నెహ్రూన‌గ‌ర్‌, చ‌ల‌సానిన‌గ‌ర్‌, గీతాన‌గ‌ర్‌, బాలాజీన‌గ‌ర్‌, ద్వార‌కాన‌గ‌ర్‌, భూపేష్‌గుప్తాన‌గ‌ర్‌, భ్ర‌మ‌రాంబ‌పురం, తార‌క‌రామాన‌గ‌ర్ వాసులు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వ‌చ్చేది. అయితే ఈసారి కుండపోతగా వర్షం కురిసినా.. 11.5 లక్షల క్యూసెక్కుల వరద కృష్ణాకు వచ్చినా.. ఈ కాలనీలు సేఫ్ జోన్ లో ఉన్నాయి. వరద నీరు కాలనీలోకి ఎంటరే కాలేదు. వీళ్లంతా పున‌రావాస ప్రాంతాల‌కు పోవాల్సిన అవ‌స‌రమే రాలేదు.

వైఎస్ జగన్ కట్టించిన ర‌క్ష‌ణ గోడ వల్లే కృష్ణలంక వాసులు పున‌రావాస ప్రాంతానికి పోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింద‌ని స్థానికులుచెబుతున్నారు.ఈ రక్షణ గోడ వల్లే 12 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద వ‌చ్చినా విజ‌య‌వాడ వాసులు భ‌యం లేకుండా నిశ్చింతగా నిద్ర‌పోవ‌చ్చ‌ని చెబుతున్నారు.అందుకే వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించడానికి వచ్చిన జగన్ కు కృష్ణలంక ప్రజలు జేజేలు కొట్టారు.

 

Back to top button