క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : శ్రీ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం అభివృద్ధే లక్ష్యంగా కాలనీ మేనిఫెస్టో ఆవిష్కరించారు దేవరింటి మస్తాన్ రెడ్డి. కాలనీలో కొలువైన కనకదుర్గామాత, నల్లపోచమ్మ ఆలయాల్లో పూజల అనంతరం మేనిఫెస్టోను సంక్షేమ సంఘం సభ్యుల చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అందరిలో ఒకరిగా ఉంటూ.. సంక్షేమ సంఘం సమగ్రాభివృద్దికి పాటు పడుతానని ఈ సందర్భంగా మస్తాన్ రెడ్డి హామీ ఇచ్చారు. వార్డు కార్యాలయాన్ని కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకురావడమే తన ప్రధమ లక్ష్యమని చెప్పారు.మార్పు కోసం తనను గెలిపించాలని కాలనీవాసులను మస్తాన్ రెడ్డి అభ్యర్థించారు. కాలనీ మేనిఫెస్టో ఆవిష్కరణలో సంక్షేమ సంఘం నేతలు, సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
608 Less than a minute