చండూరు, క్రైమ్ మిర్రర్: గ్రామాలలో బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని చండూరు ఎస్సై సురేష్ అన్నారు. మంగళవారం ఆయన క్రైమ్ మిర్రర్ ప్రతినిధితో మాట్లాడారు. గ్రామాలలో ఎవరైనా మద్యం విక్రయిస్తున్నట్లయితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. అలాగే గంజాయి అమ్మకాల పైన కూడా గట్టిగా నిఘా పెట్టినట్లు తెలిపారు. గంజాయి తీసుకుంటున్నట్లుగా అనుమానం ఉన్న వ్యక్తులను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. గంజాయి విక్రయాలపైన గాని ఎవరైనా గంజాయి తీసుకుంటున్నట్లుగాని సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
23,575 Less than a minute