తెలంగాణ

బీఆర్ఎస్‌కి భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : 2023 వరకూ పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సమస్యను ఎదుర్కొందో.. ఇప్పుడు బీఆర్ఎస్ సరిగ్గా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు దిగి.. కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు. అధినేత కేసీఆర్ ఎంతలా చెబుతున్నా గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం గూటికి చేరారు. శనివారం నాడు నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ ఇద్దరూ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Read Also : తెలుగు రాష్ట్రాలకు నేడు బిగ్‌ డే.. ముఖ్యమంత్రుల సమావేశంపై సర్వత్ర ఉత్కంఠ!!

ఇదిలాఉంటే.. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన సరిత ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సరిత మాత్రమే కాదు.. ఇతర కాంగ్రెస్ నేతలు సైతం కృష్ణమోహన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపైనే ఇటీవల గాంధీ భవన్ ఎదుట గద్వాల కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, సరితను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నించింది. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని.. అన్ని విధాలుగా ఉంటామని పార్టీ అధిష్టానం ఆమెకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి మోహన్ రెడ్డి చేరిక నేపథ్యంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఇంట్రస్టింగ్‌గా మారింది.

ఇవి కూడా చదవండి : 

  1. ఉపాధ్యాయ బదిలీల్లో అవకతవకలు.. పట్టించుకోని మండల విద్యాధికారి
  2. హత్నూర మండల బిఎస్పి పార్టీ అధ్యక్షుడు పవన్ కుమార్ పార్టీకి రాజీనామా…
  3. 10 ఎకరాల లోపు రైతులకే రైతు భరోసా?.. ముగిసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం
  4. తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (సీఈఓ)గా సుదర్శన్ రెడ్డి
  5. అట్లుంటది మనతోని.. బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రి కైర్ స్టార్మర్‌కు అభినందనలు తెలిపిన కల్వకుంట్ల హిమాన్షు!!

Back to top button