క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ సోదరుడు అమన్ ప్రీతిసింగ్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. యాంటీనార్కోటిక్స్ బ్యూరో, ఎస్ఓటి, రాజేంద్రనగర్ పోలీసులు చేపట్టిన ఉమ్మడి దాడుల్లో అమన్ ప్రీతిసింగ్ తో సహా పలువురి పేర్లు వెలుగులోకి వచ్చాయి. పలువురిని పరీక్షించగా డ్రగ్స్ వినియోగించినట్లుగా తేలింది. దీంతో అమన్ తో సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో టాలీవుడ్ లో మరోకమారు టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేగింది. టాలీవుడ్ కు చెందిన నటీనటులు ఇంకా ఎంతమంది ఇలాంటి డ్రగ్స్ కేసులతో ముడిపడి ఉన్నారు అనేది సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.
167 Less than a minute