చండూరు,క్రైమ్ మిర్రర్: చండూర్ మున్సిపాలిటీ లోని డాన్ బోస్కో జూనియర్ కాలేజీ లో మరియన్ మంత్ క్రీడా పోటీలను కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ రాజేశ్ మంగళవారం ఘనంగా ప్రారంబించారు. పవిత్ర మేరీ మాత ఆశీస్సులతో ఈ క్రీడా పోటీలను ప్రారంభించుకోవడమైనది అని అన్నారు. విద్యార్ధులు నాలుగు గ్రూప్ లుగా ఫాతిమా మాత, వెళ్ళాంకిని మాత , లూర్ధు మాత, గునదల మాత గా ఏర్పడి వివిధ క్రీడలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ రాజేశ్ మాట్లాడుతూ పునీత మేరీ మాత గారు విద్యార్దినీ విద్యార్ధులకు విద్యా జ్ఞానం తో పాటు మానసిక , శారీరక ద్రుడత్వాన్నిఈ పోటీల ద్వారా అందింస్తుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ బలశౌరి రెడ్డి , అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ మరియన్న , బ్రదర్ సుశాంత్, వైస్ ప్రిన్సిపల్ వినోద్ కుమార్ , కళాశాల ఆద్యాపకులు మరియు విద్యార్దినీ విద్యార్దులు పాల్గొనడమైనది.
140 Less than a minute