మిలాద్ ఉన్ నబి పండుగ సందర్బంగా చార్మీనార్ దగ్గర ఊహించని ఘటన జరిగింది. స్థానికులతో పాటు పోలీసులను పరుగులు పెట్టించింది.హైదరాబాద్ పాతబస్తీలో చరిత్రాత్మక చార్మినార్ దగ్గర మిలాద్ ఉన్ నబి పండుగ సందర్బంగా అల్ ఇండియా సున్ని యునైటెడ్ ఫోరమ్ అధ్వర్యంలో ర్యాలీ తీశారు. మిలాద్ ర్యాలీ లో టపాసులు కాల్చారు యువకులు. టపాసులు కాల్చడంతో ఎగిసిపడ్డ నిప్పు రవ్వలు డీజే సౌండ్ సిస్టమ్ లోని జెనరేటర్ పై పడ్డడంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో భయంతో అంతా పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలంలో ఉన్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో చార్మీనార్ దగ్గర కాసేపు హై టెన్షన్ నెలకొంది.
1,614 Less than a minute