హైదరాబాద్ లో హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చిన , మార్కింగ్ చేసిన ఇండ్ల బాధితులు అరిగోస పడుతున్నారు. మూడు రోజులుగా రోడ్లమీదే ఉంటున్నారు. తమకు దిక్కెవరని రోదిస్తున్నారు. పైసా పైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇంటిని కూల్చేస్తే తమకు చావే శరణ్యమని చెబుతున్నారు. తెలంగాణ భవన్ కు వచ్చిన తమ ఆవేదన చెప్పుకుంటున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
హైడ్రా బాధితుల కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కంటి మీద కునుకు ఉండట్లేదు.. ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్దం కావట్లేదు అంటూ వాళ్లు రోదిస్తున్న దృశ్యాలు చూస్తే అందరి కళ్లలో నీళ్లు వస్తున్నాయి. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్నం.. మా ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు.. మా గుండె ఆపోతుందని బోరుమంటున్నారు బాధితులు. గొంతులోకి అన్నం దిగట్లేదు.. టీవీ చూస్తే భయం అయితుంది.. రాజకీయ నాయకులే మమ్మల్ని మోసం చేస్తే మా బాధ ఎవరికి చెప్పుకోవాలని దిక్కులు పగిలేలా ఏడుస్తున్నారు హైడ్రా బాధితులు.
నాకు కళ్ళు కనిపించవు.. మా బాధ చెప్పుకుందాం అని ఇక్కడికి వచ్చానని చెప్పాడు ఓ అంధుడు. ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చి కరెంట్ బిల్ ఇచ్చి, టాక్స్ కట్టించుకుంటుూ, SBI లాంటి పెద్ద పెద్ద బ్యాంకులు లోన్లు ఇచ్చిన ఇండ్లు అక్రమం అని కూలగొడ్తే మా బాధ ఎవరికి చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు దండం పెట్టి చెప్తున్నాం.. దయచేసి మాకు సపోర్ట్ చేయండి.. జర్నలిజం చచ్చిపోయిందా
అక్రమ కట్టడాలు అని పదే పదే ఎందుకు చెప్తున్నారు.. అమ్ముడు పోయారా అంటూ శాపనార్ధాలు పెడుతున్నారు బాధితులు.
మీకు రేటింగ్స్ కోసం తప్పుడు ప్రచారం చేయకండి.. నిజం నిర్భయంగా చెప్పాలని కోరుతున్నారు.