ఆంధ్ర ప్రదేశ్తెలంగాణహైదరాబాద్

కూతురు మృతి.. బోరున ఏడ్చిన రాజేంద్రప్రసాద్

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి కన్నుమూశారు. నిన్న చాతీలో నొప్పి రావడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు. కూతురి మృతితో రాజేంద్రప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమెకు గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోతున్నారు. రాజేంద్రప్రసాద్‌ను సినీ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు.
హీరో సాయికుమార్, శివాజీ రాజా, అనిల్ రావిపూడి గాయత్రి మృతదేహానికి నివాళి అర్పించారు.

రాజేంద్రప్రసాద్ కుమార్తె పార్థివ దేహానికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా రాజేంద్రప్రసాద్ ను పరామర్శించారు.

గతంలో జరిగిన ఓ ఆడియో రిలీజ్‌ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్‌ తన కుమార్తె గురించి మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యారు. తల్లి లేని ప్రతి ఒక్కరూ కుమార్తెలో తన తల్లిని చూసుకుంటారన్నారు. కూతురు సెంటిమెంట్‌తో వచ్చిన తల్లి తల్లి నా చిట్టి తల్లి..అనే పాట తనకెంతో ఇష్టమన్నారు. ఆ పాటను గాయత్రికి ఎన్నోసార్లు వినిపించినట్లు చెప్పారు. ఈ వీడియో వైరల్ గా మారింది. అందరిని కంటతడి పెట్టిస్తోంది.

Back to top button