క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: అర్హులైన వారందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డులు లేకపోవడంతో రేషన్ కార్డు ని ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టడం సరికాదన్నారు. ప్రతి మనిషికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పారితోషకం పెంచడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాలను మెరుగుపరచాలన్నారు. కాగా ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆర్ఎంపీలు, పీఎంపీల పైన అధికారుల దాడులు జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఆర్.ఎం.పి, పిఎంపీల సమస్యల పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వం నుంచి తగిన వైద్య సేవలు అందించేందుకు కావలసిన చర్యలన్నీ తీసుకోవాలని అధికారులకు తెలిపారు.
387 Less than a minute