మా నాన్న కేసు విచారణలో ఎందుకు అంత ఆలస్యం?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో ఎందుకు అంత ఆలస్యం జరుగుతోందని వివేకా కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి అన్నారు. సమీప భవిష్యత్తులో విచారణ ప్రారంభమయ్యే ఆనవాళ్లు కనిపించడంలేదని.. ఆరు నెలల్లో ట్రయల్‌ మొత్తం పూర్తిచేసేలా నాంపల్లి సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీచేయాలని ఆమె తెలంగాణ హైకోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో సీబీఐతోపాటు నిందితులు టి.గంగిరెడ్డి, వై.సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరి (అప్రూవర్‌), డి.శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు.

నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్!… రాష్ట్రంలో కొత్తగా 20వేల ఉద్యోగాలు?

సీబీఐ సమర్పించిన హార్డ్‌డి్‌స్కల్లో 13 లక్షల ఫైల్స్‌ ఉండగా ఇప్పటివరకు 13,717 ఫైల్స్‌ మాత్రమే ఓపెన్‌ చేశారన్నారు. ఇలాగే.. రోజుకు 500 ఫైల్స్‌ చొప్పున ఓపెన్‌ చేసుకుంటే పోతే మరో ఏడేళ్లయినా ట్రయల్‌ ప్రారంభం కాదని చెప్పారు. ఈ కేసులో సాక్షి వైఎస్‌ అభిషేక్‌రెడ్డి తాజాగా మరణించారని తెలిపారు. ట్రయల్‌ ప్రారంభం కాకపోతే ఇబ్బందులు వస్తాయని, నిందితులందరికీ నోటీసులు జారీచేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘నిందితులకు నోటీసులిస్తే ఏం లాభం.. మేం ట్రయల్‌కు సహకరిస్తున్నాం’ అని చెబుతారని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపడతామని పేర్కొంటూ విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది.

రంజీల్లో పాదాలు మోపిన కోహ్లీ!… కేరింతలతో అభిమానులు స్వాగతం?

Exit mobile version