Andhra PradeshTelanganaUncategorized

13 మంది సర్పంచుల రిజైన్.. సొంత జిల్లాలో సీఎంకు బిగ్ షాక్

స్థానిక సంస్థల మండలి ఎన్నికల వేళ సంచలనం

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికలు జరుగుతున్న వేళ ముఖ్యమంత్రికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. సొంత జిల్లాలోనే 13 మంది సర్పంచులు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ బిగ్ షాక్ తగిలింది. సొంత గడ్డ కడపి జిల్లాలోనే ఆయనకు వైసీపీ నేతలు ఊహించని ఝలక్ ఇచ్చారు. ఏకంగా 13 మంది సర్పంచులు వైసీపీకి రాజీనామా చేశారు. వైయస్సార్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు పత్రికా ప్రకటన విడుదల చేశారు. సీఎం జగన్ సొంత సొంత గడ్డలో 13 మంది సర్పుంచులు రాజీనామా చేసిన ఘటన కడప జిల్లాతో పాటు ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Read More : గాయపడిన సీపీఐ నారాయణ.. వైసీపీ ఎంపీ చికిత్స

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట మండలంలో వైయస్సార్ పార్టీ కి మూకుమ్మడి రాజీనామా చేస్తున్నట్లుగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఖాజీపేట మండలంలో మొత్తం 21 పంచాయతీలు ఉండగా 13 మంది సర్పంచులు ప్రత్యేకంగా సమావేశమై… కేవలం వైయస్సార్ పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లు గా పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సంక్షేమ పథకాల అమలులో సర్పంచుల పాత్ర లేకుండా చేయడమే కాక 14వ, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించడంపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More : ఢిల్లీలో దిక్కు లేని కేసీఆర్.. మూడురోజులైనా నో అపాయింట్ మెంట్స్

ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయడానికి సిద్ధపడ్డట్లుగా పత్రికా ప్రకటనలో తెలియజేశారు సర్పంచులు. ఇక నుంచి తమ గ్రామ పంచాయతీలలో వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, శానిటేషన్ కార్యక్రమంతో పాటుగా ఇతర నిర్వహణ భారాలను బహిష్కరిస్తున్నట్లు గా పత్రికా ప్రకటనలో తెలియజేశారు సర్పంచులు. కడప జిల్లా సర్పంచులు ఇచ్చిన షాక్ తో వైసీపీలో కలవరం కనిపిస్తోంది. రాజీనామా చేసిన సర్పంచులతో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మంతనాలు సాగిస్తున్నారని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి …

  1. విలపించిన చంద్రబాబు ఇంటికొచ్చాక ఏం జరిగింది? భువనేశ్వరి ఏం చేసింది?
  2. కేసీఆర్ ను కలిసిన జగన్.. చంద్రబాబుపైనే చర్చా?
  3. ఇంతకి ప్రధాని క్షమాపణ కోరినట్టేనా? బీజేపీది మాటల గారడీనా?
  4. గత 30 ఏండ్లలో అతిపెద్ద వర్షం.. టీటీడీకి కోలుకోలేని నష్టం

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.