
వరంగల్,జూన్ క్రైమ్ మిర్రర్: ఇతర రాష్ట్రాలకు రవాణాకు సిద్దంగా వున్న 370 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్టీఆర్ నగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన సూమారు 8లక్షల విలువ గల క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన పీడీఎస్ బియ్యాన్ని ఇతర రాష్ర్టాలకు తరలించేందుకు గాను ఎర్పాటు చేసిన లారీతో పాటు ఆటో ట్రాలీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరానికి సంబంధించి పోలీసులు హన్మకొండ ప్రాంతానికి చెందిన మిహాజ్ హుస్సేన్, దుగ్గొండి మండలానికి చెందిన రాజేష్, గుజరాత్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ హామీర్ మోరీ ని పోలీసులు అరెస్టు చేయగా మరో ఐదుగురు నిందితులు పరారీలో వున్నారు ఇందులో తాజుధ్దీన్, యాకూబ్ పాషా, కరీంపాషా, ఆకు రౌడీ, యూనీస్ ఖాన్ ప్రస్తుతం పరారీలో వున్నారు. ప్రస్తుతం పరారీలో వున్న నిందితులు చుట్టు ప్రక్కల గ్రామాల్లో పి.డి.ఎస్ రైస్ ను కోనుగోలు చేసి గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలకు తరలించేవారని. ఈ నిందితులపై గతంలోను పలు పోలీస్ స్టేషన్లలో కేసులి నమోదు కాబడ్దాయి టాస్క్ ఫోర్స్ ఎ.సి.పి ప్రతాప్ కుమార్ తెలియజేసారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ జీ తో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గోన్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను, లారీ, ఆటో, పి.డి.ఎస్ రైస్ ను ఇంతేజార్ గంజ్ పోలీసులు అందజేశారు.