

సిద్దిపేట, క్రైమ్ మిర్రర్: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ చైర్మన్ వి.ప్రకాశ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రాష్ట్ర చైర్మన్ ఆలయానికి రావడంతో ఆలయవర్గాలు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఆలయంలో చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించడంతో కుటుంబ సభ్యులు మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈవో ఏ.బాలాజీ, ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, తదితరులున్నారు.