

బడంగ్ పేట కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి
మహేశ్వరం, క్రైమ్ మిర్రర్: బడంగ్ పేట కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ లో శ్రీ పురం కాలనీ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 3.25 లక్షల వ్యయం తో పనులను బడంగ్ పెట్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి ప్రారంభించారు. తెలంగాణా లో మున్సిపాలిటీ లు గ్రామాలు అభివృద్ధి పాదంలో దూసుకుపోతున్నాయి అంటే కేవలం టి ఆర్ ఎస్ పార్టీ తోనే సాధ్యం అవుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక 8వ డివిజన్ కార్పొరేటర్ గుడెపు ఇంద్రసేనా, కార్పొరేషన్ కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు మర్రి జగన్ మోహన్ రెడ్డి, కాలనీ అసోసియేషన్ సభ్యులు,మహిళలు పాల్గొన్నారు.