
తుర్కయంజాల్,జూన్ 23 క్రైమ్ మిర్రర్: తుర్కయంజాల్ మున్సిపాలిటీ 7వ వార్డులో స్థానిక కౌన్సిలర్ రొక్కం అనితాచంద్రశేఖర్రెడ్డి ఆద్వర్యంలో అభివృద్ధి పనులకు చైర్ పర్సన్ అనురాధ రాంరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీని అన్ని వార్డుల్లో సమస్యలను గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. పార్టీలకతీతంగా అన్ని వార్డులకు నిధులు కేటాయిస్తూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ హరితాధన్‌రాజ్‌గౌడ్, కౌన్సిల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కొశికె ఐలయ్య, బీజేపీ ఫ్లోర్ లీడర్ కడారి శ్రీలత అనిల్‌కుమార్, కౌన్సిలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, కౌన్సిలర్లు మర్రి మాధవి మహేందర్‌రెడ్డి, కుంట ఉదయశ్రీ గోపాల్‌రెడ్డి, నారని కవితాశేఖర్గౌడ్, కాకుమాను సునీల్, కంబాలపల్లి ధన్‌రాజ్, కొండ్రు మల్లేశ్, పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు.