

పాలేరు, జూలై 24 క్రైమ్ మిర్రర్: తెలంగాణ ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు 45 పుట్టినరోజు సందర్భంగా తలపెట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం కూసుమంచి మండలంలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం నుండే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కూసుమంచి మండల కేంద్రంలో సూర్యాపేట – ఖమ్మం జాతీయ ప్రధాన రహదారి మీదా నూతనంగా నిర్మించిన రోడ్ డివైడర్ దగ్గర అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేసే డివైడర్ పై మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.తరువాత అటవీ శాఖ వారి అధ్వర్యంలో ఎవెన్యు ప్లాంటేషన్ లో బాగంగా మొక్కలను నాటారు.
పాలేరు గ్రామంలోని పాలేరు రిజర్వాయర్ అందాలను చూసి రిజర్వాయర్లలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నర్సింహులగూడెం కిష్టాపురం గ్రామాల మధ్య ఉన్న వాగు ఉదృతంగా ప్రవహించడంతో గ్రామ ప్రజలకు తగు సూచనలు చేశారు వరదల సమయంలో వాగు దాటే ప్రయత్నం చేయొద్దు ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు కోరారు. అనంతరం ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి సొంత గ్రామమైన రాజుపేట గ్రామంలో పర్యటించారు అదే సమయంలో తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఇటీవల మరణించిన కిన్నెర మన్నెమ్మ అ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కుసుమంచి ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్, డిసిసిబి డైరెక్టర్ ఇంటర్ శేఖర్, కూసుమంచి మండల అధ్యక్షుడు చాట్ల పరశురాం, సిడిసి చైర్మన్ జూకూరి గోపాలరావు , ఆత్మ కమిటీ చైర్మన్ రామసహాయం బాలకృష్ణ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఎం.డి అసిఫ్ పాషా,కూసుమంచి యూత్ అధ్యక్షుడు తంగెళ్ల బుచ్చిబాబు, పేరిక సింగారం ఎంపీటీసీ మోదుగు వీరభద్రం, వివిధ గ్రామ సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు.