Andhra PradeshTelangana

పురుగు కుడితే ప్రాణాలు పోతాయంటూ ప్రచారం…. అవాస్తవమని తెలిపిన ఏపీ శాస్త్రవేత్తలు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పురుగు కుడితే ప్రాణాలు పోతాయంటూ ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాతో పాటూ వాట్సాప్‌లో సమాచారం చక్కర్లు కొడుతోంది. ఈ ప్రచారంపై ఏపీకి చెందిన శాస్త్రవేత్తలు స్పందించారు. గొంగళి పురుగు ఆకారంలో ఉండే ఓ పురుగు మనుషులను కుడితే ఐదు నిమిషాల్లో మరణిస్తారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రెడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ మల్లీశ్వరి తెలియజేశారు.

Read Also : తెలంగాణ ఇలాగే అప్రతిహతంగా విజయపథంలో దూసుకుపోవాలి… సి‌ఎం కే‌సి‌ఆర్

రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ పురుగుల కారణంగా మనుషులు మరణిస్తారని ప్రచారం జరుగుతోంది అన్నారు. ఈ ప్రచారంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.. ఈ పురుగును నేటిల్‌మాత్‌ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఎక్కువగా విదేశీ అడవుల్లో ఉంటుందని.. మన దేశంలో చాలా అరుదుగా పండ్ల తోటల్లో కనిపిస్తుందని తెలిపారు. ఈ పురుగును తాకితే మంట, దురద ఏర్పడుతుందని.. అది కూడా ఒక్క రోజులోనే తగ్గిపోతుంది అన్నారు.

Also Read : విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయి… అమిత్ షా

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ పురుగు లద్దె పురుగు ఆకారంలో ఉండి.. శరీరంపై వెంట్రుకలతో ఉంటుంది. ఈ వెంట్రుకల చివరిభాగం లో స్వల్ప విషపూరిత పదార్థం ఉంటుంది. ఇది ఆ పురుగుకు ఆత్మరక్షణ కోసం ఉంటుంది. ఇది ఆకుల క్రింది వైపు ఉండి.. ఆకులను తింటూ ఉంటుంది. ఈ పురుగు ప్రత్తి పంటలో అసలు కనపడదు. రైతులందరూ దీనిని అర్థం చేసుకొని ఇలాంటి నిరాధారమైన ప్రచారాన్ని నమ్మొద్దంటు తెలిపారు.

Read Also : బి‌జే‌పికి వ్యతిరేకంగా పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఫ్లెక్సిల కలకలం….

గత రెండు మూడు రోజుల నుంచి వాట్సప్ గ్రూపులో పత్తి పంటలో ఒక పురుగు ఉంది.. ఆ పురుగు మనిషిని తాకిన వెంటనే ఐదు నిమిషాల్లో మనిషి చనిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. జాగ్రత్తగా ఉండండి అని అందర్నీ భయపెడుతూ పురుగు ఫోటోలు, చనిపోయినట్టు ఉన్న మనుషుల ఫోటోలను, ఆడియో మెసేజ్‌లను ఫార్వార్డ్ చేస్తున్నారు. దీంతో శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి : 

  1. విద్యార్థులకు కుళ్లిపోయిన భోజనం.. సమైక్యత వేడుకల్లో దారుణం
  2. భూనిర్వాసితులకు పరిహారం చెల్లింపులో వివక్ష చూపడం దుర్మార్గం… బక్కని నర్సింహులు
  3. సెప్టెంబర్ 17న కేసీఆర్ సంచలన ప్రకటన?
  4. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త లొల్లి…. రేవంత్ వ్యాక్యలపై సీనియర్లు సీరియస్

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.