Telangana

ఎల్లుండి మునుగోడులో రేవంత్ రెడ్డి పాదయాత్ర.. టికెట్ రేసులో ముందున్న చెరుకు సుధాకర్?

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఆయన రాజీనామాతో తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అస్తశస్త్రాలు బయటికి తీస్తోంది. మునుగోడు ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇప్పటికే చండూరులో సభ నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వస్తానని చెప్పారు. అందులో భాగంగానే ఎల్లుండి మునుగోడు నియోజకవర్గంలో పాదయాత్ర చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రలో స్థానిక ప్రజలతో మమకేం కానున్నారు రేవంత్ రెడ్డి.

Also Read : హైద‌రాబాద్ ఈడీకి పవర్ ఫుల్ ఆఫీసర్.. సీఎం కేసీఆర్ కు బిగుస్తున్న ఈడీ ఉచ్చు! గులాబీలో గుబులు..

మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ పెద్దలు.. గాంధీభవన్ లో కసరత్తు చేస్తున్నారు. బుధవారం రోజంతా సమావేశాలు నిర్వహించిన ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్.. గురువారం కూడా నాన్ స్టాప్ గా సమావేశాలు జరిపారు. మనిక్కమ్ ఠాగూర్ అధ్యక్షతన జరిగినన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ సెక్రటరీలు నదీమ్ జావిద్ , చౌదరి , వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి , నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ , భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ , ఈరవత్రి అనిల్ పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అభ్యర్థిపై ఎంపికైనా మాట్లాడారని తెలుస్తోంది. మునుగోడు టికెట్ రేసులో ఉన్న చెరుకు సుధాకర్ ను ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలుపించుకుని మనిక్కమ్ ఠాగూర్ మాట్లాడం ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు టికెట్ రేసులో చెరుకు సుధాకర్ ముందున్నారనే టాక్ గాంధీభవన్ లో వినిపిస్తోంది.

Read Also : మర్రిగూడ మండల కేంద్రంలో 2k ఫ్రీడమ్ రన్….

రాజగోపాల్ రెడ్డి కి మాట్లాడే అవకాశం వచ్చిందంటే కాంగ్రెస్ వల్లే అన్నారు టీపీసీసీ ప్రచార కమిటి చైర్మెన్ మధుయాష్కీ గౌడ్. రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఐదు నిమిషాల్లో ఆమోదించడమే ఇందుకు సంకేతమన్నారు మధుయాష్కీ. మునుగోడులు ఎవరికి టికెట్ ఇచ్చిన అందరం కలిసి పని చేస్తామని అభ్యర్థులు హామీ ఇచ్చారని చెప్పారు. సర్వే ఆధారంగానే అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు మధుయాష్కీ గౌడ్. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ సచ్చిపోయిందంటున్న రాజగోపాల్ రెడ్డికి మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు.

ఇవి కూడా చదవండి :

  1. మునుగోడు నియోజకవర్గంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి…
  2. నెరవేరనున్న కోమటిరెడ్డి కల… ప్రజలకు వరంగా మారనున్న తన రాజీనామా!
  3. మునుగోడు బైపోల్ వేళ బీజేపీ సంచలనం.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కు తీన్మారేనా?
  4. రోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వైద్యుడికి పదేళ్ల జైలు శిక్ష
  5. బీసీకే మునుగోడు కాంగ్రెస్ టికెట్? అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ వెయిట్ అండ్ సీ పాలసీ…

ad 728x120 SRI swami - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.