Telangana

మునుగోడుపై రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్! ఒకే దెబ్బకు మూడు పిట్టలు..

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 22 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఇప్పుడాయన బీజేపీలో చేరుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కోమటిరెడ్డి రాజీనామాతో త్వరలో మునుగోడుకు ఉప ఎన్నిక రానుంది. అయితే సిట్టింగ్ సీటు కావడంతో మునుగోడును ఉప ఎన్నికల సవాల్ గా తీసుకుంటోంది కాంగ్రెస్. మునుగోడుపై దూకుడుగా వెళుతున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన చేసిన మూడు రోజుల్లోనే మునుగోడులో బహిరంగ సభ నిర్వహించారు. మునుగోడు గడ్డ నుంచే గర్జించారు. రాజగోపాల్ రెడ్డిని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరుకి వెళ్లి ప్రచారం చేస్తానని ప్రకటించారు రేవంత్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి విషయంలో రేవంత్ రెడ్డి క్లారిటీగా ఉన్నారని అంటున్నారు. ఆయన వ్యూహంతో అధికార టీఆర్ఎస్, బీజేపీలో ఆందోళన నెలకొందనే టాక్ వస్తోంది.

మునుగోడు నియోజకవర్గంలో బీసీ ఓటర్లే దాదాపు 70 శాతం ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 27 వేల ఓట్లు ఉన్నాయి. సామాజిక వర్గాల వారీగా చూస్తే గౌడ్ లు 32 వేల మంది ఓటర్లు ఉండగా.. పద్మశాలీలు 35 వేల వరకు ఉన్నారు. ముదిరాజ్ లు 31 వేల మంది, యాదవ సామాజిక వర్గం నుంచి దాదాపు 26 వేల మంది ఓటర్లు మునుగోడు నియోజకవర్గంలో ఉన్నారు. మొత్తంగా దాదాపు లక్షా 50 వేల మంది బీసీ ఓటర్లే ఉన్నారు. ఎస్సీలు కూడా ఎక్కువే. మాదిగలు 25 వేల వరకు ఉండగా..మాలలు 11 వేల ఓటర్లు ఉన్నారు. ఎస్టీలు 11 వేల వరకు ఉన్నారు. మైనార్టీల వర్గానికి చెందిన 6 వేల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా మునుగోడు నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల వారే 90 శాతానికి పైగా ఉన్నారు. ఓసీల్లో రెడ్డి ఓటర్లు 7 వేల 6 వందలు కాగా.. కమ్మలు దాదాపు 5 వేలు ఉన్నారు. వెలమ ఓటర్లు రెండున్నర వేలు ఉండగా.. ఆర్యవైశ్య, బ్రహ్మణ సామాజికవర్గాల నుంచి మరో 4 వేల మంది ఓటర్లు ఉన్నారు.

మునుగోడులో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో రేవంత్ రెడ్డి సూపర్ స్కెచ్ వేశారని అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న చెరుకు సుధాకర్ ను ఆయన తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చెరుకుపై ఏకంగా పీడీ చట్టం కింద కేసు పెట్టడంతో ఆరు నెలల పాటు జైలులో ఉన్నారు. ఉద్యమకారుడిగా గుర్తింపు ఉన్న చెరుకు సుధాకర్ ను మునుగోడు బరిలో దింపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ మునుగోడు సభ రోజే చెరుకు సుధాకర్ ఢిల్లీలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. మునుగోడులో గౌడ్ ఓటర్లు దాదాపు 35 వేలు. సుధాకర్ భార్య ఎస్సీ మాదిగ. గతంలో ఆమె నకిరేకల్ ఎస్సీ రిజర్వ్ సీటు నుంచి పోటీ చేశారు. మునుగోడులో ఎస్సీ ఓటర్లు 36 వేలు. చెరుకు సధాకర్ పోటీలో ఉండే ఈ రెండు సామాజిక వర్గాల మద్దతు లభిస్తుందని రేవంత్ రెడ్డి లెక్కలు వేశారని అంటున్నారు.

లెఫ్టిస్ట్ భావజలం కలిగిన చెరుకుకు వామపక్ష పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మునుగోడు నియోజకవర్గంలో సీపీఐ, సీపీఎంకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. రెండు వామపక్ష పార్టీలకు దాదాపు 20 వేల ఓటు బ్యాంక్ ఉందని అంచనా వేస్తు్ననారు. అందుకే చండూరు సభలో పదేపదే రేవంత్ రెడ్డి కమ్యూనిస్టులను పొగుడుతూ మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టు పార్టీల మద్దతు కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. చెరుకుకు టికెట్ ఇస్తే వామపక్షాల మద్దతు కాంగ్రెస్ దక్కే అవకాశం ఉంది. చెరుకు సుధాకర్ ని తెరపైకి తీసుకురావడం ద్వారా బలమైన అభ్యర్థిని బరిలో దింపడంతో పాటు తనకు కొరకరాని కొయ్యగా మారిన కోమటిరెడ్డి బ్రదర్స్ కు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేలా రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారని అంటున్నారు. చెరుకు సుధాకర్ మొదటి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ కు వ్యతిరేకంగా పని చేశారు. అందుకే చెరుకు సుధాకర్ చేరికను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పుపట్టారు. అయినా చెరుకును పార్టీలో తీసుకురావడం ద్వారా వెంకట్ రెడ్డికి షాకిచ్చారు రేవంత్ రెడ్డి. మునుగోడు టికెట్ కూడా ఇచ్చి కోమటిరెడ్డికి మరింత రేవంత్ రెడ్డి మరింత ఝలక్ ఇవ్వబోతున్నారనే ప్రచారం సాగుతోంది.

ఇవి కూడా చదవండి …

  1. మునుగోడులో కూసుకుంట్లకు చెక్.. ఏకమైన టీఆర్ఎస్ బీసీ నేతలు
  2. కోమ‌టిరెడ్డికి క్షమాపణ చెప్పిన అద్దంకి ద‌యాక‌ర్‌
  3. గాలి తప్ప అన్నిటిమీదా పన్నే!.. పాలపై జీఎస్టీ ఎత్తేయాలని కేసీఆర్ డిమాండ్
  4. నాంపల్లి సీఐ శంకర్ రెడ్డి పై బదిలీ వేటు.
  5. జనసేనలోకి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్విరాజ్…

ad 728x120 SRI swami - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.