NationalTelangana

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్! జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న కేసీఆర్

రాష్ట్రపతి ఎన్నికలతో దేశ రాజకీయాల్లో కాక పెరుగుతోంది. ప్రెసిడెంట్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగా… విపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని పెట్టేందుకు ఆమె జూన్ 15న ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బరిలో ఉండబోతున్నారని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికకు ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థి ఎవరనే అంశం చర్చకు వస్తున్న ప్రతిసారీ ప్రధానంగా పవార్‌ పేరే వినబడుతూ వస్తోన్న విషయం తెలిసిందే. తదుపరి రాష్ట్రపతి ఎన్నికకు తమ అభ్యర్థిగా శరద్‌ పవారే ఉండాలని పలు ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

శరద్ పవారను ప్రెసిడెంట్ అభ్యర్థిగా నిలబెట్టాలని కాంగ్రెస్‌ కూడా తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఆ పార్టీ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే గురువారం శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన సందేశంతో ముంబయి వెళ్లి పవార్‌ను కలిసి చర్చలు జరిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌లతోనూ ఖర్గే చర్చలు జరిపారు. అంతేకాకుండా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ ఆయన ఫోన్‌లో సంప్రదించారు. ఇంకోవైపు, ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ కూడా ఆదివారం శరద్‌ పవార్‌ను కలిసి చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికలపైనే వారు చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికపై ఈ నెల 15న దిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటితో మమతా బెనర్జీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలపై ప్రతిపక్షాలు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.

శరద్‌ పవార్‌ దేశంలోనే ఎంతో సీనియర్‌ రాజకీయ దిగ్గజం. అనేక పార్టీల మధ్య పొత్తులు, సంకీర్ణ ప్రభుత్వాలను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించిన అపార అనుభవం ఉంది. మహారాష్ట్రలో సైద్ధాంతిక వైరుధ్యాలు కలిగిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లను భాజపాకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి తీసుకొచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విపక్షాల ఏకం చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. ముంబై వెళ్లి శరద్ పవార్ తో చర్చలు జరిపారు. ఆ సమయంలోనే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలని పవార్ కు కేసీఆర్ సూచించారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేసీఆర్ .. బెంగాల్ సీఎంతోనూ చర్చించారని సమాచారం .ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. దీంతో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ సత్తా చాటే రోజులు రాబోతున్నాయని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.