Andhra PradeshTelangana

వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్‌. కృష్ణయ్యపై నాన్‌బెయిలబుల్‌ కేసు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తెలంగాణ వ్యక్తి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు ఊహించని షాక్ తగిలింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆర్‌. కృష్ణయ్యపై హైదరాబాద్‌లో పోలీస్‌ కేసు నమోదైంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది. రౌడీలు, గూండాలతో బెదిరిస్తున్నారంటూ రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూకబ్జాతో పాటు హత్యకు యత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్‌ కృష్ణయ్యపై 447, 427, 506, 384 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Also Read : ట్రాఫిక్ చలానా ఖరీదు చిన్నారి ప్రాణం.!

ఏపీ కోటాలో త్వ‌ర‌లో ఖాళీ కానున్న 4 రాజ్యస‌భ స్థానాల ఎన్నిక‌లు శుక్ర‌వారం పూర్తి అయ్యాయి. 4 స్థానాల‌కు కేవ‌లం 4 నామినేష‌న్లే వ‌చ్చిన నేప‌థ్యంలో… నామినేష‌న్లు వేసిన న‌లుగురు వైసీపీ అభ్య‌ర్థులు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి, ఆర్.కృష్ణ‌య్య‌, బీద మ‌స్తాన్ రావు, నిరంజ‌న్ రెడ్డిలు ఏకగ్రీవంగానే ఎన్నికైన‌ట్లు కాసేప‌టి క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రిట‌ర్నింగ్ అధికారి నుంచి న‌లుగురు అభ్య‌ర్థులు తాము రాజ్య‌స‌భ‌కు ఏకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు డిక్ల‌రేష‌న్ల‌ను అందుకున్నారు.

ఇవి కూడా చదవండి …

  1. ఆర్య స‌మాజ్‌లో జరిగే పెళ్లిళ్ల‌ు చెల్లవు… సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు
  2. బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకు?
  3. చంద్రబాబును సీఎం పీఠం నుంచి దించేయాలని కేసీఆర్ కుట్రలు చేశారా?
  4. సోనియాగాంధీకి కరోనా పాజిటివ్.. కాంగ్రెస్ కేడర్ లో కలవరం..
  5. మల్ రెడ్డి జోరుతో సుదీర్ రెడ్డికి చెమటలు! కాంగ్రెస్ నేతలతో ఎమ్మెల్యే కోవర్ట్ ఆపరేషన్లు?

ad 728x120 Garuda copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.