Andhra PradeshTelangana

మరో పరువు హత్య.. బేగంబజార్ లో వెంటాడి చంపిన దుండగులు

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : సరూర్ నగర్ నాగరాజు పరువు హత్య మరవకముందే హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. బేగం బజార్‌ షాహీనాథ్‌ గంజ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. కత్తులు, రాళ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రేమ వివాహం చేసుకున్నారన్న కక్షతో దాడి చేసినట్లు తెలుస్తోంది. బేగంబజార్‌లోని మచ్చి మార్కెట్‌లో ఘటన జరిగింది.

Also Read : పద్మశ్రీ అవార్డు తిరిగి ఇచ్చేస్తాంటున్న మొగులయ్య?

మృతుడు ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో అమ్మాయి తరపు కుటుంబసభ్యులు, బంధువులు కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ..మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి శరీరంపై 10 నుంచి 20 కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించారు. పరువు హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైకులపై వచ్చిన ఐదుగురు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. మృతుడిని నిందితులు వెంటాడుతూ వచ్చారని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి …

  1. ఢిల్లీలో కేసీఆర్..విదేశాల్లో కేటీఆర్! తెలంగాణలో పడకేసిన పాలన..
  2. తెలంగాణలో జనసేనే కింగ్ మేకర్.. 80 సీట్లకు పోటీ చేస్తామన్న పవన్ కల్యాణ్..
  3. అధికార పార్టీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం.. కొట్టి చంపారనే ఆరోపణలు
  4. దిశా నిందితుల ఎన్‌కౌంటర్ బూటకం.. 10 మంది పోలీసులపై మర్డర్ కేసు!
  5. జగన్ కోటాలో పార్థసారథి రెడ్డికి కేసీఆర్ రాజ్యసభ సీటు!

ad 728x120 Garuda copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.