
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బండి సంజయ్ ప్రజాసంగ్రామ ముగింపు సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. అమిత్ షా తో పాటు బండి సంజయ్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్న మంత్రులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు.. కమలం నేతలకు స్ట్రాంగ్ కౌంటరిస్తున్నారు. కేసీఆర్ ను ఓడించేందుకు బండి సంజయ్ ఒక్కడు చాలన్న అమిత్ షా కామెంట్లపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ చాలైతే.. అమిత్ షా తెలంగాణలో ఏం పీకడానికి వచ్చారని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.
Read More : కూసుకుంట్లను తరిమికొడతామంటున్న జనం.. అసలేం జరిగింది?
అమిత్ షా ఆరోపణలకు కౌంటరిచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేంద్రం తెలంగాణ చేసిందేమి లేదన్నారు తలసాని. మోడీ, అమిత్ షాలు తమ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందస్తుకు వెళితే.. తాము కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకు బీజేపీ సిద్ధమా అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. ఎవరొచ్చినా కేసీఆర్ ను ఏం చేయలేరని చెప్పారు. రాహుల్ గాంధీ, అమిత్ షాలను పర్యాటకులతో పోల్చారు తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ వస్తున్న టూరిస్టులు తెలంగాణకు ట్యాక్స్ కడుతున్నారంటూ సెటైర్లు వేశారు.తెలంగాణలో బీజేపీకి అన్ని సీట్లలో అభ్యర్థులు కూడా లేరన్నారు తలసాని. టీఆర్ఎస్ తో ఎవరితోనూ ములాఖత్ కావాల్సిన అవసరం లేదన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పోయింది నిజం కాదా అని ప్రశ్నించారు. గత లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీకి కాంగ్రెస్ సహకరించిందని అన్నారు.
మంత్రి తలసాని ముందస్తు సవాల్ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. పీకే టీమ్ తో కేసీఆర్ సర్వేలు చేయిస్తుండటంతో.. ముందస్తు కోసమే ఆయన కసరత్తు చేస్తున్నారని చర్చ జరిగింది. తాజాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందస్తు గురించి మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది.
ఇవి కూడా చదవండి ..
- రూ. 100లక్షల కోట్ల అప్పు ఎవరి కోసం చేశారు మోడీ?.. కేటీఆర్ సూటి ప్రశ్న..
- బీజేపీ తెలంగాణ సీఎం అభ్యర్థిగా బండి సంజయ్? అమిత్ షా సిగ్నల్..!
- ఇంట్లో గోడ కట్టి భార్యను బంధించిన పుల్లారెడ్డి మనవడు… గృహ హింస కేసు నమోదు
- కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డికి బిగ్ షాక్.. నల్గొండ కాంగ్రెస్ లో రచ్చేనా?
- ఎవని పాలయిందిరో తెలంగాణ సంపద.. రేవంత్ రెడ్డి సంచలనం..
One Comment