
హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబ సభ్యుడిపై గృహహింస ఆరోపణలు వచ్చాయి. భార్యను బంధించేందుకు సదరు కోటీశ్వరుడు ఏకంగా ఇంట్లోనే గొడ కట్టడం కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ స్వీట్ల వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన జి.పుల్లారెడ్డి మనవడు ఏక్నాథ్ రెడ్డిపై గృహహింస కేసు నమోదైంది. తన భార్య బయటకు రాకుండా రాత్రి రాత్రే ఆమె గదిలో ఏక్‌నాథ్‌రెడ్డి గోడ కట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు మధ్య బాధితురాలని కాపాడారు.
గత కొంత కాలంగా ఏక్నాథ్ రెడ్డి అతడి భార్య మధ్య కలహాలు కొనసాగుతున్నాయి. భార్యను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఏక్నాథ్రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. కలసి ఉండలేక బయటపడేందుకు అతడి భార్య చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గొడవలు మరింత ముదిరాయి. ఇంట్లోనే ఆమెను ఉంచి బయటకు రాకుండా గోడ కట్టి .. రూమ్‌కు లాక్ వేసి ఏక్నాథ్ రెడ్డి వెళ్లిపోయాడు. పై అంతస్తు నుంచి కిందకు రాకుండా మెట్ల మార్గాన్ని మూసేసేందుకు ఇటకలతో గోడను నిర్మించాడు. అక్కడి నుంచి బయటకు ఎలా రావాలో తెలియని బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేసింది. పోలీసుల సాయంతో బయటపడింది.
తన తండ్రితో కలిసి పోలీసులకు భర్త ఏక్నాథ్రెడ్డిపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జి.పుల్లారెడ్డి కుమారుడి కొడుకైన ఏక్నాథ్రెడ్డిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఏకనాథ్ రెడ్డి ఇంటిని పరిశీలించిన పోలీసులు.. ఇంటి లోపల కట్టిన గోడను చూసి షాకయ్యారు. గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదంటున్నారు పోలీసులు. సిమెంట్ ఇటుకలతో గోడను నిర్మించారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
One Comment