Telangana

తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. రాహుల్ సభలో కాంగ్రెస్ గూటికి తీన్మార్ మల్లన్న!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా దూకుడుగా వెళుతున్న తెలంగాణ బీజేపీకి ఊహించని షాక్ తగలబోతుందని తెలుస్తోంది. ఆ పార్టీకి కీలక నేత రాజీనామా చేయబోతున్నారని సమాచారం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా ఉన్నారు తీన్మార్ మల్లన్న అలియాస్ తీన్మార్ మల్లన్న. సీఎం కేసీఆర్ పై పోరాటం చేస్తున్న మల్లన్నకు జనాల్లో మంచి క్రేజీ ఉంది. తన సొంత యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కారు పార్టీకి కంట్లో నలుసులా మారిపోయాడు తీన్మార్ మల్లన్న. ఆయనపై కేసులు పెట్టి జైళ్లో కూడా వేశారు. జైలు నుంచి వచ్చిన తర్వాత బీజేపీలో చేరారు తీన్మార్ మల్లన్న. అయితే కొద్ది రోజులుగా ఆయన కమలం పార్టీతో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. తన ఛానెల్ లోనూ బీజేపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో బీజేపీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం సాగుతోంది.

తాజాగా ఆదివారం 7200 సభలో మాట్లాడిన తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను బీజేపీ కార్యాలయానికి వెళ్లనని స్పష్టం చేశారు. దీంతో ఆయన పార్టీ మారుతారా..లేక అక్కడే ఉండి ప్రజా పోరాటం కొనసాగిస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఏ నాయకుడు ఎంత భూమిని కబ్జా చేశారో తన దగ్గర చిట్టా ఉందన్నారు. 15 వేల 14 ఇళ్లకు ఓ దొర చొప్పు తయారు అయ్యారని దుయ్యబట్టారు. వారి నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు ప్రజా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. త్వరలో ప్రజల్లోకి వెళ్లి అన్ని వివరిస్తానని తీన్మార్ మల్లన్న చెప్పారు. తన కుటుంబసభ్యుల పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసి ఇస్తానన్నారు. క్యూన్యూస్ ఛానల్‌ ద్వారా ప్రజల తరపున ప్రశ్నిస్తున్నానన్నారు. 7200 పేరుతో త్వరలో భారీ సభ ఏర్పాటు చేస్తామన్నారు తీన్మార్ మల్లన్న.

అంబేద్కర్ ఆశయాలను ముందుకు పోతామని మల్లన్న స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. తెలంగాణలో ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఉచిత విద్యను అందించాలన్నారు. రాష్ట్రంలో విద్య కూడా కొందరి చేతుల్లో ఉందని విమర్శించారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు. సమ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమ భవిష్యత్ కార్యాచరణ ఏంటో త్వరలో వెల్లడిస్తామన్నారు తీన్మార్ మల్లన్న.దీంతో మల్లన్నకు బీజేపీకి రాజీనామా చేయడం ఖాయమని తేలిపోయింది. అయితే ఆయన సొంత పార్టీ పెట్టుకుంటారా లేక మరో పార్టీలో చేరుతారా అన్న చర్చ సాగుతోంది. మే6న రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది పీసీసీ. ఆ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డితో ఇప్పటికే తీన్మార్ మల్లన్న చర్చలు జరిపారని అంటున్నారు.

ఇవి కూడా చదవండి ..

  1. ప్రశాంత్ కిషోర్ సంచలనం..
  2. కేటీఆర్ బూతు పురాణం వెనుక పీకేనా.. ఓటమి భయమా?
  3. పెట్రోల్ రేటు రూ.4 తగ్గింది.. ఎక్కడంటే?
  4. రక్తదానం ప్రాణదానంతో సమానం.. డిసిపి వెంకటేశ్వర్లు..
  5. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలి

ad 728x120 Garuda copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.