
క్రైమ్ మిర్రర్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి మూడు గంటల పాటు నానా హైరానా పడ్డారు. తీవ్రంగా కలవరపడ్డారు. ఆమె కోసం అధికారులు, పోలీసులు పరుగులు పెట్టారు. మంత్రి రోజా తిరుపతి పర్యటనలో ఇది జరిగింది. తిరుపతిలో పర్యటించిన మంత్రి ఆర్కే రోజాకు గురువారం వింత అనుభవం ఎదురైంది. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తన సొంత జిల్లాకు వెళ్లిన రోజా బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం సమయంలో పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు.
ఆమెను సన్మానించేందుకు అధికారులు, వైసీపీ నేతలు పోటీ పడ్డారు.
Also Read : 111జీవో ఎత్తివేత.. 84 గ్రామాల్లో పండుగ
భారీ జన సందోహంలో రోజా ఫోన్ మిస్సైంది. రద్దీలో ఓ వ్యక్తి రోజా మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. తన సెల్ ఫోన్ కనిపించకపోయే సరికి రోజా కంగారు పడ్డారు. వెంటనే పక్కనే ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి మొబైల్ ఫోన్ చోరీకి గురైందన్న ఫిర్యాదుతో పోలీసులు కూడా వెనువెంటనే రంగంలోకి దిగేశారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో రోజా మొబైల్‌ను చోరీ చేసిన వ్యక్తిని గుర్తించారు. రోజా సెల్ ఫోన్‌ను తస్కరించిన వ్యక్తి.. ఫోన్‌తో కారు ఎక్కేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కారు నెంబరు ఆధారంగా పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పద్మావతి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళ్లినట్టుగా గుర్తించారు. వెంటనే అక్కడికి పరుగులు పెట్టిన పోలీసులు ఎట్టకేలకు దొంగను పట్టుకున్నారు. అతడి నుంచి సదరు సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, మంత్రికి అందజేశారు.
Also Read : బట్టేవాజ్, లుచ్చాగాడు.. మోడీని టార్గెట్ చేసిన కేటీఆర్
నిందితుడిని అక్కడ పనిచేసే వాచ్‌మెన్‌గా చెబుతున్నారు. అయితే, ఈ పరిణామం కొద్దిసేపు కలకలం సృష్టించింది. సాక్షాత్తూ మంత్రి సెల్‌ఫోన్ చోరీకి గురవడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. మంత్రి రోజా సెక్యూరిటీ సిబ్బందితో పాటు.. పోలీసులకు చెమటలు పుట్టించింది. అయితే, ఎట్టకేలకు రోజా సెల్‌ఫోన్ దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి ..
- సీఎం కాన్వాయ్ కోసం కారు లాక్కుంటారా… ఇదేం పాలన జగనన్నా!
- తెలంగాణలో ఫ్యాక్షన్ సీన్.. టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య
- తెలంగాణలో మాస్క్ లేకుంటే వెయ్యి ఫైన్..
- బిగ్ బ్రేకింగ్.. జగన్ కు థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు
- అర్ధరాత్రి అమ్మాయి దగ్గర డబ్బుల్ వసూల్! కానిస్టేబుల్, హోంగార్డ్ అరెస్ట్