
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ప్రత్యర్థి వాహనాన్ని వెంబడించడం… మరో వాహనం అడ్డుపెట్టి… దొరికాకా నరికి చంపడం.. ఫ్యాక్షన్ సినిమాలో కనిపించే సీన్లు ఇవి. రాయలసీమలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. తెలంగాణలోనూ అలాంటి ఘటనే జరిగింది. ఫ్యాక్షన్ సినిమాలను తలపించేలా వాహనంతో ఆపి దారుణంగా హతమార్చారు. అక్కడే ఆయుధాలను వదిలి పరారైయ్యారు. ప్రధాన రహదారిపై జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Read Also : 111జీవో ఎత్తివేత.. 84 గ్రామాల్లో పండుగ
మహబూబాబాద్ మున్సిపాలిటీలో 8వ వార్డు కౌన్సిలర్ రవి దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. పత్తిపాక వద్ద ట్రాక్టర్‌తో ఢీకొట్టి కిందపడేశారు దుండగులు. అనంతరం గొడ్డలితో విచక్షణరహితంగా దాడి చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారైయ్యారు. తీవ్ర గాయాలైన రవిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రవి..ఇటీవల టీఆర్ఎస్లో చేరారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశమైయ్యారు. అనంతరం బైక్‌పై పత్తిపాకలోని తన మిత్రుడి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది.
Read More : బట్టేవాజ్, లుచ్చాగాడు.. మోడీని టార్గెట్ చేసిన కేటీఆర్
రవి హత్యకు పాతకక్షలే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. రవి హత్యకు వ్యాపార లావాదేవీలే కారణమని గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇద్దరిని గుర్తించామని పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులందరినీ గుర్తిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి ..
- సీఎం కాన్వాయ్ కోసం కారు లాక్కుంటారా… ఇదేం పాలన జగనన్నా!
- 3 గంటలు రోజా హైరానా.. ఉరుకులు పరుగులు.. ఏమైందో తెలుసా!
- తెలంగాణలో మాస్క్ లేకుంటే వెయ్యి ఫైన్..
- బిగ్ బ్రేకింగ్.. జగన్ కు థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు
- అర్ధరాత్రి అమ్మాయి దగ్గర డబ్బుల్ వసూల్! కానిస్టేబుల్, హోంగార్డ్ అరెస్ట్
2 Comments