
- పరువు హత్య కేసులో పోలీసుల పురోగతి
- 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- హత్యకేసులో ప్రధాన సూత్రధారి మామ వెంకటేష్
- భువనగిరి, సిధ్దిపేట ఏసీపీలు సంయుక్తంగా కేసును దర్యాప్తు
క్రైమ్ మిర్రర్, యాదాద్రి: భువనగిరి పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రస్తుతం ఇప్పటివరకూ 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పోలీసులు తెలిపారు. మాజీ హోంగార్డు రామకృష్ణ హత్యకేసులో పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించినట్లు తెలుస్తుంది. సిద్ధిపేట జిల్లా లకుడారంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద పాతిపెట్టిన రామకృష్ట మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టంకు తరలించారు.
Also Read : ప్రేమించిన భార్య.. ఘోర హత్యకు గురైన ప్రేమికుడు
రామకృష్ణ హత్యకేసులో ప్రధాన సూత్రధారి మామ వెంకటేష్‌గా గుర్తించారు. రామకృష్ణ మృతదేహంపై గాయాలున్నట్లు రాచకొండ పోలీసు కమీషనరేట్ నుంచి వచ్చిన క్లూస్ టీం గుర్తించారు. ఘటనా స్ధలం నుంచి ఆధారాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఎప్పుడు హత్య చేశారు ? ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎందుకు హత్య చేసారో, ఈ ఘోరఘటనకు కారణమైన వారు ఇంకా ఎంతమంది ఉన్నారో అనే కోణంలోను క్లూటీం ఆరాలు చేపట్టింది. భువనగిరి, సిధ్దిపేట ఏసీపీ లు సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తుచేస్తున్నారు.
ఇంతవరకూ వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. లతీఫ్ గ్యాంగ్ రామకృష్ణను నెలరోజులుగా ట్రాప్ చేస్తోంది. తన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో రామకృష్ణను చంపేయాలని అతని మామ వెంకటేశ్… లతీఫ్ గ్యాంగ్‌ను ఆశ్రయించినట్లు తెలుస్తుంది. దుబాయ్ నుంచి వచ్చానని, స్థలం కావాలని నమ్మించాడు. 5వేలు డబ్బు కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. రెండ్రోజుల క్రితం రామకృష్ణను జిమ్మాపూర్ సర్పంచ్ అమృతరావు ఇంటి నుంచి పిలుచుకుని వెళ్లాడు. ఆ తర్వాత రామకృష్ణ ఇంటికి రాలేదు.
Read More : మళ్లీ పంజా విసిరిన కోవిడ్.. చైనాలో లాక్ డౌన్
దీంతో అతడి భార్య భార్గవి అమృతరావుకు ఫోన్ చేసింది. అయితే తనకేం తెలియదని చెప్పాడు. దీంతో భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే రామకృష్ణను నమ్మించి మోత్కూరు తీసుకెళ్లిన లతీఫ్ గ్యాంగ్… జమిచెట్టు బావి దగ్గర హత్య చేసినట్లు క్లూ టీం పసిగట్టింది. ఆ తర్వాత మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి సిద్ధిపేట జిల్లా లకుడారం గ్రామ సమీపంలో పూడ్చిపెట్టారు. ఈకేసులో వెంకటేష్ లతీఫ్ 10 లక్షల రూపాయలు సుపారీ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి ..
- ఏజేన్సీల్లో మావోల అలజడి ..
- యాదాద్రి జిల్లాలో మరో పరువు హత్య! అ్లలుడిని చంపేసిన మామ
- వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు ఇవే..?
- ధాన్యం దిగుమతులపై తెలంగాణ అధికారుల డేగ కన్ను
- ధనిక తెలంగాణలో 10వ తేదీ వచ్చినా జీతాల్లేవ్!