
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : హనుమాన్ జయంతి సందర్భంగా భాగ్యనగరంలో భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ సంయుక్తంగా శోభాయాత్ర ర్యాలీ చేపట్టనున్నాయి. గౌలిగూడ రాంమందిర్ నుంచి తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు యాత్ర సాగుతుంది. మొత్తం 21 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు శోభాయాత్ర మొదలై రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. ఊరేగింపులో వేల సంఖ్యలో కార్యకర్తలు, యువకులు పాల్గొంటారు. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి.
హనుమాన్ శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర రూట్ మ్యాప్‌ను పోలీసులు పరిశీలించారు నగర సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు.ప్రత్యేక బస్సులో రూట్ మ్యాప్ పరిశీలించారు. 8 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉండనున్నానరు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, తదితర కీలక ప్రాంతాల్లో యాత్ర కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలను సైతం అమర్చారు. సీసీ కెమెరాలను ఆయా పీఎస్‌ల ద్వారా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. అదనంగా మరో నాలుగు డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నారు.
Also Read : సార్ వచేదెప్పుడో- తనిఖీలు చేసేదెప్పుడో.. కానరాని ఫుడ్ ఇన్స్పెక్టర్
శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. గౌలిగౌడ రామ్‌మందిర్ నుంచి ఆంధ్రా బ్యాంక్ కోఠి వరకు, కోఠిలోని డీఎంహెచ్ కార్యాలయం నుంచి కాచిగూడ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, వీఎస్టీ, బాగ్‌లింగంపల్లి, ఇందిరాపారర్క్, కవాడీగూడ క్రాస్ రోడ్స్ వరకు ఆంక్షలు ఉన్నాయి. ఇటు ప్యారడైజ్ కూడలి నుంచి బ్రూక్ బాండ్ కాలనీ, బ్రూక్ బాండ్ నుంచి తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
Read More : సార్ వచేదెప్పుడో- తనిఖీలు చేసేదెప్పుడో.. కానరాని ఫుడ్ ఇన్స్పెక్టర్
హనుమాన్ శోభాయంత్రతో నగరంలో మద్యం అమ్మకాలపై బంద్ విధించారు. హైదరాబాద్‌లోని మూడు కమిషరేట్ల పరిధిలో ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు ఉండవు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- చైనాలో కొవిడ్ కల్లోలం.. ఆంక్షలతో 40 కోట్ల మందికి నరకం
- తెలంగాణలో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లంటే.. లెటేస్ట్ సర్వేలో సంచలనం…
- ధాన్యం దిగుమతులపై తెలంగాణ అధికారుల డేగ కన్ను
- చత్తీస్ ఘడ్ లో మావోల ఘాతుకం… వంతెనను పేల్చివేసిన మావోయిస్టులు
- ఆర్టీసీ ఛార్జీల పెంపు పై టీడీపీ ఆందోళన
3 Comments