Telangana

కాంగ్రెస్ నేత వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడి…

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ.హనుమంతరావు ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఈ దాడికి పాల్పడ్డారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారును కూడా ధ్వంసం చేశారు. తన ఇంటిపై జరిగిన రాళ్లదాడిపై వీహెచ్ స్పందించారు. దాడికి పాల్పడినవారిని గుర్తించాల్సింది పోలీసులేనని అన్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీగా పనిచేసిన తనకే రక్షణ లేకుండా పోయిందని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. తన కారును ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More : పర్యావరణమా.. నీ జాడెక్కడ..?

విహెచ్ ఇంటి పైన దుండగుల దాడి ని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హనుమంతరావు తో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ లో రోజు రోజుకూ శాంతి భద్రత లు క్షిణిస్తున్నాయి . దోషులను పోలీసులు వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. వి.హనుమంతరావు ప్రజల మనిషి ఎవరి ఆపద వచ్చిన ముందుంటారు అలాంటి వ్యక్తిపై దాడి ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు మరింత భద్రత కల్పించాలి. కాంగ్రెస్ నాయకులపై దాడులు జరిగితే ఊరుకునేది లేదు.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేసారు.

ఇవి కూడా చదవండి ..

  1. కెమికల్ కంపెనీలో మంటలు.. 10 మంది సజీవ దహనం.. ఏలూర్ లో ఘోరం!
  2. ఏసీబీ వలలో అవినీతి అధికారి
  3. టీఆర్ఎస్, బీజేపీ దొంగ నాటకాలు.. భరతం పడతామన్న రేవంత్
  4. తిరుమ‌ల‌లో తీవ్ర తోపులాట‌.. ముగ్గురికి సీరియస్
  5. ఎంపీ అర్వింద్ ఇంటి ముందు వడ్లు పోసిన రైతులు

ad 728x120 Garuda copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.