Telangana

పర్యావరణమా.. నీ జాడెక్కడ..?

కంపు కొడుతున్న గ్రామం, జోరందుకున్న ఈగల బెడద..!

వేల సంఖ్యలో కోళ్ల మృత కళేబరాలు, ఊర్లకు ఈడ్చుకెళ్తున్న కుక్కలు

నిమ్మకు నీరెత్తిన అధికారుల పర్యవేక్షణ, రసాయనాల పిచికారి శూన్యం.

అమ్ముడు పోయిన పెద్ద మనుషులు, అడిగే నాధుడు కరువు.

రానున్న రోగాలకు బాద్యులెవరు..? చిన్న పిల్లలపై చూపనున్న ప్రభావం..!

క్రైమ్ మిర్రర్, నల్లగొండ నిఘా ప్రతినిధి : ప్రస్తుతం ఉన్న పర్యావరణ పరిస్థితులలో ఎప్పుడు ఏ కొత్త రోగం వస్తుందో గుర్తించటం కష్టంగా మారింది. అధికంగా కోళ్ల వల్లే కొన్ని రకాల రోగాలు మనుషులను ఇబ్బంది కలిగిస్తుందన్న విషయం అందరికి తెలిసిందే. కాలం కన్నెర చేసి కొంత నష్టం జరిగితే, మరి కొంతమంది పెద్ద మనుషుల బిజినెస్ ల కారణంగా నష్టాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ వ్యాపారాల వల్ల స్థానికంగా ఇబ్బంది పడుతున్న పది మందికి కూడా కనీసం ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చెయ్యలేని బడా లీడర్లు ఇక వారి ఆరోగ్యాల గురించి పట్టించుకోరు? అనే ప్రశ్నకు జవాబులా నరసింహాపురం లేయర్ ఫామ్ తయారైంది.

Also Read : కోమటిరెడ్డి కి కీలక పదవి.. రాజగోపాల్ రెడ్డి దారెటో?

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల పరిధిలో ఒక లక్ష ముపై వేల సామర్ద్యం గల రెండు లేయర్ ఫామ్స్ ను ఊరికి అతి దగ్గరగా నిర్మించారు. ఈ నిర్మాణానికి ఆది నుంచి అంతం వరకు కూడా పనులు జరగవద్దని ప్రజలు అడ్డం పడుతున్నప్పటికి అప్పటి అధికారులు సదరు బిజినెస్ మ్యాన్ దగ్గర గట్టిగానే తాయిలాలు అంటుకున్నారని అందుకే నిర్మాణం ఆగలేదని ఇప్పటి వరకు కూడా విమర్శల సెగ గట్టిగానే తగులుతుంది. అక్రమ కేసులు, పెద్ద ఎత్తున గొడవలు జరిగినప్పటికి కొంత కాలం ప్రజలు కచ్చితంగానే ఉన్నారని, చివరికి ఏమి జరిగిందో తెలియదు కాని నిర్మాణం పూర్తయింది.

Read More : ధనిక తెలంగాణలో 10వ తేదీ వచ్చినా జీతాల్లేవ్!

గ్రామానికి లేయర్ భూతం రానే వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిభంధనలను గాలికి వదిలేసి సదరు వ్యాపారి లేయర్ ఫామ్స్ ను నడుపుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. విషయాని తెలుసుకున్న క్రైమ్ మిర్రర్ నిజాని ప్రజలకు తెలియపరిచే ప్రయత్నం చేసింది. నరసింహాపురంలో ఉన్న లేయర్ ఫామ్స్ ను సందర్శించగా ఒక ప్రదేశంలో ఏర్పాటు చేసిన పెద్ద గుంతలో చనిపోయిన వేల కొద్ది కోళ్లను పడేసారు. ఎన్నో రోజుల నుండి డంప్ చేస్తున్న వీటి శరీరాలు ఎండకు పగిలిపోయి పురుగులు, ఈగలు, చుట్టు పక్కల కుక్కలు పెద్ద ఎత్తున కనిపించాయి. ఈ గుంత వరకు వెళ్లి చూడటం ఏమాత్రం సాద్యపడకుండా ఉవ్వెత్తున చెడు వాసనలు వెదజల్లుతున్నాయి.

ఇట్టి విషయమై గ్రామంలో ప్రజలను అడుగగా చనిపోయి కుళ్ళిపోయిన కోళ్లను చుట్టు పక్కల ఉండే ఊర కుక్కలు గ్రామంలోకి ఈడ్చుకు వస్తున్నాయని, దీని వల్ల ఊరంతా ఒక రకమైన చెడు వాసనలు అల్లుముకుంటున్నాయని తెలిపారు. సరి అయిన సమయానికి పెంట ఎత్తకపోవటం, నిర్ణిత గడువులోపు పిచికారి చెయ్యక పోవటం వల్ల గ్రామంలో పెద్ద ఎత్తున ఈగలు వస్తున్నాయని, ఇక వర్షాకాలం వస్తే చాలు నరకం అనుభవిస్తున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేసారు. వీటి వల్ల ఊరిలో చిన్న పిల్లలకు ఏమైనా జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు.

రానున్న రోజుల్లో ఏదైనా ఇబ్బంది జరిగితే ఎవరు బాద్యులని ప్రశ్నిస్తున్నారు. గ్రామంలోని కొంత మంది సదరు వ్యాపారికి అనుగుణంగా ఉండటం వల్లే సమస్య పై ఎవరు కూడా మాట్లాడటం లేదని అన్నారు. ఉన్నత అధికారులు దీనిపై వెంటనే స్పందించి మాకు న్యాయం చెయ్యాలని ప్రజలు పత్రికా ముఖంగా కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి ..

  1. జగన్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.. క్యాబినెట్లో బీసీలకు జగన్ పెద్దపీట
  2. ఆశావహుల్లో నిరసన జ్వాల… రోడ్డెక్కిన అసమ్మతి
  3. కేబినెట్ కూర్పులో బీజేపీ మార్క్! జగన్ జగమెండి కాదా?
  4. మినిస్టర్ గా ఫైర్ బ్రాండ్.. చంద్రబాబుకు ఇక బ్యాండ్
  5. బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన మందమర్రి

ad 728x120 Garuda copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.