
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పదేళ్ల క్రితం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో విచారణ ముగిసింది. రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేలా అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. దాదాపు పదేళ్ల పాటు విచారణ కొనసాగింది. ఇప్పుడీ వ్యవహారంపై నాంపల్లి నాయస్థానం తీర్పు ఇవ్వనుంది. కోర్టు తీర్పు అక్బరుద్దీన్‌కు అనుకూలంగా వస్తుందా ? ప్రతికూలంగా వస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది ? అసలే రంజాన్ మాసం కావడంతో తదిపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ వ్యక్తమవుతోంది.
నిర్మల్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ అక్బరుద్దీన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మీరు వంద కోట్ల మంది… మేం పాతిక కోట్లు మాత్రమే .. ఓ పదిహేను నిమిషాల మాకు ఇస్తే.. ఎవరు ఎక్కువ తక్కువో చూపిస్తామంటూ అప్పట్లో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఐపీసీ 120- బీ, 153 ఏ, 295, 298, 188 సెక్షన్ల కింద పోలీసులు సుమోటోగా కేసులు పెట్టారు. ఈ కేసులో అరెస్టు అయిన అక్బరుద్దీన్ 40 రోజుల పాటు జైల్లో శిక్ష అనుభవించారు. అదిలాబాద్‌లో హిందూ దేవతల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కేసులపై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు వెలువడనుంది. కోర్టు శిక్ష విధిస్తే రెండేళ్ల వరకు అక్బరుద్దీన్‌కు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి ..
- ఎంపీ అర్వింద్ ఇంటి ముందు వడ్లు పోసిన రైతులు
- పర్యావరణమా.. నీ జాడెక్కడ..?
- ప్రయాణికులపై దూసుకెళ్లిన రైలు.. శ్రీకాకుళంలో ఐదుగురు దుర్మరణం
- అసమ్మతి నేతలపై జగన్ ఫోకస్.. బాలినేనికి కీలక పదవి ?
- జగన్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.. క్యాబినెట్లో బీసీలకు జగన్ పెద్దపీట