Telangana

జగన్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.. క్యాబినెట్లో బీసీలకు జగన్ పెద్దపీట

  • మోడీ తో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు ఇదే పద్ధతిని అనుసరించాలి
  • తెలంగాణ బీసీ నేత, సరూర్ నగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు  ఆకుల అరవింద్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కేబినెట్లో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని తెలంగాణ బీసీ నాయకుడు, సరూర్ నగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు ఆకుల అరవింద్ కుమార్ అన్నారు. క్యాబినెట్ కూర్పు లో భాగంగా 25 మందిలో పదిమంది బీసీలకు స్థానం కల్పించి, అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో అమ్మలు చేసి చూపించారని అన్నారు.

ఇన్నాళ్లు బీసీలను కేవలం ఓటు బ్యాంకు గానే కొన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటూ వస్తున్నాయని, కానీ జగన్ మాత్రం దానికి భిన్నంగా మంత్రివర్గంలో బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను కల్పించాలని పేర్కొన్నారు. జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని సరూర్నగర్ డివిజన్ లో ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఆకుల అరవింద్ నివాళులర్పించారు.

Read More : మినిస్టర్ గా ఫైర్ బ్రాండ్.. చంద్రబాబుకు ఇక బ్యాండ్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర క్యాబినెట్ లోని ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన మంత్రివర్గంలో పెద్ద పీట వేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ తాను బీసీనని చెప్పుకోవడమే మినహాయిస్తే, ఓబీసీలకు ఇప్పటివరకు చేసిందేమీ లేదని మండిపడ్డారు.

ఇప్పటివరకు జాతీయ కులగణన కూడా చే పట్టలేని అసమర్థ పరిస్థితుల్లో ప్రధాని మోడీ ఉన్నారని ఆకుల అరవిందు ధ్వజమెత్తారు. జనాభాలో 52 శాతం పైగా ఉన్న ఓబీసీలకు కేంద్ర క్యాబినెట్ లో ఎంతమంది బీసీలకు స్థానం కల్పించారు ప్రధాని మోడీ బహిరంగంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర క్యాబినెట్ తో పాటు అన్ని రాష్ట్రాలలోనూ జనాభా ప్రాతిపదికన బీసీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్యలు తీసుకోవాలని అరవింద్ కోరారు.

ఇవి కూడా చదవండి ..

  1. ఆశావహుల్లో నిరసన జ్వాల… రోడ్డెక్కిన అసమ్మతి
  2. కేబినెట్ కూర్పులో బీజేపీ మార్క్! జగన్ జగమెండి కాదా?
  3. వెంకట్ రెడ్డికి కీలక పదవి.. రాజగోపాల్ రెడ్డి దారెటో?
  4. కేబినెట్ విస్తరణతో… బయిట పడుతున్న అసంతృప్తులు
  5. ధనిక తెలంగాణలో 10వ తేదీ వచ్చినా జీతాల్లేవ్!

ad 728x120 Garuda copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.