Telangana

వెంకట్ రెడ్డికి కీలక పదవి.. రాజగోపాల్ రెడ్డి దారెటో?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదంతో ఈ నిర్ణయం జరిగిందని తెలిపింది. టీపీసీసీలో మొదటి నుంచి రెబెల్ లీడర్ గా ఉన్నారు వెంకట్ రెడ్డి. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగానే ప్రకటనలు చేశారు. పీసీసీ పదవని అమ్ముకున్నారంటూ పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పైనా తీవ్ర కామెంట్లు చేశారు. అటు వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు ఇబ్బంది కల్గిలే కామెంట్లు చేశారు. బీజేపీ పెద్దలతో మంతనాలు సాగించారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది.

Read More : ఆశావహుల్లో నిరసన జ్వాల… రోడ్డెక్కిన అసమ్మతి

సీనియర్ నేతలు చర్చలు జరపడంతో కోమటిరెడ్డి సీన్ మారింది. రైతుల సమస్యలపై ఇందిరాపార్క్‌లో జరిగిన రెండ్రోజుల దీక్షలో రేవంత్.. కోమటిరెడ్డికి తోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకే వేదికపై కనిపించారు. రెండు నెలల క్రితం స్వయంగా రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఇటీవల పార్లమెంట్‌ ఆవరణలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రాహుల్ గాంధీ తో కొద్దిసేపు మాట్లాడారు. తెలంగాణ విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇక, ఇప్పుడు తెలంగాణలో పార్టీ పరిస్థితులపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్‌ గా నియమించింది. దీంతో ఆయన దూకుడుగా పనిచేస్తారని టీ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

Read More : టీఆర్ఎస్ లో పీకే సర్వే కలకలం.. సొంత పార్టీ నేతలపై కూసుకుంట్ల అసహనం

మరోవైపు వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ కీలక పదవి ఇవ్వగా ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది అసక్తిగా మారింది. కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీకి సానుకూలంగా మాట్లాడుతున్నారు. ఇటీవల పీసీసీ నేతలు ఢిల్లీ వెళ్లినా రాజగోపాల్ రెడ్డి వెళ్లలేదు. దీంతో ఆయన కమలం గూటికి చేరడం ఖాయమనే చర్చ జరిగింది. తాజాగా వెంకట్ రెడ్డిని స్టార్‌ క్యాంపెయినర్‌ గా నియమించడంతో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా లేక తన దారి తాను చూసుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు కోమటిరెడ్డి సోదరుల మధ్య విభేదాలు ఉన్నాయని, కొంత కాలంగా దూరంగా ఉంటున్నారనే చర్చ సాగుతోంది. వెంకట్ రెడ్డికి కీలక పదవి వచ్చినా.. రాజగోపాల్ రెడ్డి తన దారి తాను చూసుకుంటారనే ప్రచారం మునుగోడు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి ..

  1. ధనిక తెలంగాణలో 10వ తేదీ వచ్చినా జీతాల్లేవ్!
  2. మినిస్టర్ గా ఫైర్ బ్రాండ్.. చంద్రబాబుకు ఇక బ్యాండ్
  3. జగన్ టీమ్ లో రోజా, రజని… విలపించిన శ్రీధర్
  4. అటవీశాఖ సిబ్బంది ఉన్నట్టా…?? లేనట్టా….??
  5. మంత్రి కావాలనే కోరిక వుంది.. కోటంరెడ్డి

ad 728x120 Garuda copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.