
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సీఎం కేసీఆర్ ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న తెలంగాణలో పదో తారీఖు వచ్చినా ఉద్యోగులకు వేతనాలు అందని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ఇప్పటివరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేతనాలు అందలేదు. ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి , సిద్దిపేట, సూర్యాపేట,యాదాద్రి భువనగిరి,మెదక్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల టీచర్లకు ఇంకా జీతాలు పడలేదు. శాలరీలు పూర్తి స్థాయిలో చెల్లించేందుకు ఇంకో మూడు, నాలుగు రోజులు పడుతుందని ఆర్థిక, ట్రెజరీ శాఖల అధికారులు చెబుతున్నారు.
Also Read : తెలంగాణ సీఎస్‌పై వేటు? గవర్నర్ పంజా విసరబోతున్నారా?
ఇప్పటివరకు వేతనాలు అందింది కేవలం 14 జిల్లాల ఉపాధ్యాయులకు మాత్రమే. అది కూడా ఒక్కో రోజు ఒక్కో జిల్లాకు జమ అయ్యాయి. నిధుల్లేకనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రతినెలా జీతాలు విడతల వారీగా జిల్లాలకు ఇస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం ఈ నెల 11న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1,000 కోట్ల అప్పు తీసుకోనుంది. ఆ తర్వాత జీతాలు, పెన్షన్ల చెల్లింపులు పూర్తవుతాయని ఆఫీసర్లు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగులకు జీతాలను ఆలస్యంగా చెల్లిస్తూ వస్తున్నది. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో జీతాలు ఒకటో తేదీనే వస్తాయని ఉద్యోగులు ఆశించారు. కాని బడ్జెట్ తర్వాత వచ్చిన తొలి నెలలోనే వాళ్లకు సమయానికి వేతనాలు అందలేదు.
Read More : ప్రజలకు టీఎస్ఆర్టీసీ షాక్.. ఛార్జ్ ఐదు రూపాయలు హైక్
గత ఏడాది కంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి పెరిగింది. లిక్కర్‌తోపాటు రిజిస్ట్రేషన్లతో భారీగా ఆదాయం వస్తోంది. అయినా నిధుల కటకట తప్పడం లేదు. గతంలో తెచ్చిన అప్పులు, వడ్డీల చెల్లింపులకే ప్రతినెలా రూ.3 వేల కోట్ల దాకా కట్టాల్సి వస్తోంది.రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా వేతనాల రూపంలో రూ.2,600 కోట్లు చెల్లించాల్సి ఉంది. పెన్షనర్లకు రూ.1,400 కోట్ల దాకా అవుతున్నాయి. అంటే నెలకు రూ.4 వేల కోట్ల చొప్పున జీతాలు, పెన్షన్లకు రూ.48 వేల కోట్లు అవుతాయి. మరోవైపు ఈ ఏడాది రూ.59 వేల కోట్ల భారీ అప్పు తీసుకోవాలని సర్కార్ టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రతినెలా రూ.5 వేల కోట్లు అప్పు తీసుకునేలా ప్లాన్ చేసుకుంది. దీంతో అప్పుల్లో నుంచే శాలరీలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
90 శాతం ప్రభుత్వ ఉద్యోగులు హోం లోన్లు తీసుకున్నారు. పర్సనల్ లోన్లు తీసుకొని పిల్లలని చదివిస్తున్నారు. వేతనాలు సమయానికి రాకపోవడంతో ఈఎంఐలు కట్టలేకపోతున్నామని ఉద్యోగులు అంటున్నారు. రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు పదో తారీఖు లోపు వాయిదాలు చెల్లించకపోతే తమ ఖాతాలను స్తంభింపజేసి పెనాల్టీలు విధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ ఇలాంటి ఇబ్బందులు పడలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్పే ధనిక రాష్ట్రం ఇదేనా అని విమర్శలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- మినిస్టర్ గా ఫైర్ బ్రాండ్.. చంద్రబాబుకు ఇక బ్యాండ్
- జగన్ టీమ్ లో రోజా, రజని… విలపించిన శ్రీధర్
- అటవీశాఖ సిబ్బంది ఉన్నట్టా…?? లేనట్టా….??
- మంత్రి కావాలనే కోరిక వుంది.. కోటంరెడ్డి
- సీతారాముల కల్యాణానికి సిద్ధమైన భద్రాద్రి దివ్యక్షేత్రం
- చైర్ పర్సన్ చీర లాగిన టీఆర్ఎస్ నేతలు.. కొత్తగూడెం జిల్లాలో రచ్చ
2 Comments