
క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి : అటవీశాఖ సిబ్బందంటేనే అడవి జంతువులకు సంరక్షణ సైనికులు…అలాంటి అటవీశాఖ సిబ్బంది తన గెస్ట్ హౌస్ లోనే ఒక జింకను ఊర కుక్కలు వేటాడి పిక్కు తినడం ఆశ్చర్యకరమైన విషయం.పూర్తి వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో గత ఫిబ్రవరి 23వ తేదీన బుధవారం అటవీశాఖ సిబ్బందికి సంబంధించిన గెస్ట్ హౌస్ లోనే ఊర కుక్కలు ఒక జింకను వెంబడించి చంపేసి పీక తిన్నాయి. (ఏప్రిల్ 10వ)తేదీన ఆదివారం రోజున అటవీ ప్రాంతంలో జింకను వెంటాడి వేటాడి ఊర కుక్కలు చంపాయి.
Also Read : టీఆర్ఎస్ లో పీకే సర్వే కలకలం.. సొంత పార్టీ నేతలపై కూసుకుంట్ల అసహనం
ఫారెస్ట్ గెస్ట్ హౌస్ చుట్టూ కంచె వేసి ఉన్న కూడా కుక్కలు లోపలికి ఎలా వచ్చాయి.గెస్ట్ హౌస్ కు భద్రత కల్పించే వాచ్ మెన్ కానీ, అటవీశాఖ సిబ్బంది ఎక్కడ ఉన్నారో ఏమైపోయారో…? తెలియని దుస్థితి.అడవి జంతువులు చనిపోతే మాకేంటి మేం మాత్రం నిద్రమత్తులో ఉంటాం అనే విధంగా అటవీశాఖ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుకు ఈ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో జరిగిన సంఘటనే నిదర్శనం. సామాన్య ప్రజలుతమ పొలాలకు అటవీ భూమిలో నుంచి నడిస్తేనే లాఠీలు పట్టుకొని కొట్టి కేసులు పెట్టే అటవీశాఖ సిబ్బంది.
అడవి జంతువులు ఊర కుక్కలు తన గెస్ట్ హౌస్ లోనే వేటాడి చంపి పీక తింటే ఒక్క అటవీశాఖ సిబ్బంది లేకపోవడం ఎంత వరకు సమంజసమని అనంతగిరి అడవి జంతువులకే సంరక్షణ కల్పించని అటవీశాఖ సిబ్బంది ఇంకా అనంతగిరి పర్యటనకు వచ్చే పర్యాటకులకు ఏమి సంరక్షణ కనిపిస్తారో అనేది తలమానికంగా మారింది. ఇంత నిద్ర మత్తులో నిర్లక్ష్యంగా అటవీశాఖ సిబ్బంది.
Read More : యూట్యూబ్ జర్నలిస్ట్ లను స్టేషన్లో చెడ్డీలపై నిలబెట్టిన పోలీసులు#
వ్యవహరిస్తుండటం ఏంటని కొందరు పర్యాటకులు ఆరోపిస్తున్నారు. గత నాలుగు నెలల్లో సుమారు 3 నుంచి 5 వరకు జింకలు కుక్కల దాడిలో మరణించినట్లు తెలుస్తోంది. ఇకనైనా అటవీశాఖ సిబ్బంది నిర్లక్ష్యం వీడి అడవి జంతువులకు సంరక్షణ కల్పించి అనంతగిరి పర్యటనకు వచ్చే పర్యాటకులకు భద్రత, భరోసా కల్పించాలని కొందరు పర్యాటకులు వేడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి ..
- మంత్రి కావాలనే కోరిక వుంది.. కోటంరెడ్డి
- సీతారాముల కల్యాణానికి సిద్ధమైన భద్రాద్రి దివ్యక్షేత్రం
- చైర్ పర్సన్ చీర లాగిన టీఆర్ఎస్ నేతలు.. కొత్తగూడెం జిల్లాలో రచ్చ
- తెలంగాణ సీఎస్‌పై వేటు? గవర్నర్ పంజా విసరబోతున్నారా?
- ప్రజలకు టీఎస్ఆర్టీసీ షాక్.. ఛార్జ్ ఐదు రూపాయలు హైక్ –