
క్రైమ్ మిర్రర్, భద్రాచలం : రాములోరి కల్యాణానికి ఘడియలు దగ్గరపడుతున్న వేళ భద్రాద్రి దివ్య క్షేత్రం శ్రీరామ నామస్మరణతో మారుమోగుతోంది. అఖిలాంఢ కోటి బ్రహ్మాండ నాయకుడి కల్యాణ వైభవాన్ని కనులారా చూసేందుకు రెండేళ్ల తర్వాత భక్తులకు అనుమతించిన వేళ భద్రాచలం పురవీధులు సీతారాముల కల్యాణం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి.
శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో నేటి నుంచి ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. ఎదుర్కోలు మహోత్సవం శనివారం సాయంత్రం కనులపండువలగా జరగ్గా. కమనీయమైన జగదభి రాముడు – సీతమ్మదేవి కల్యాణమహోత్సవం ఆదివారం జరగనుంది. దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాద్రి పుణ్యక్షేత్రం శ్రీ రామస్మరణతో పులకించిపోతోంది. లోక కల్యాణంగా భావించే జగదభి రాముడి జగత్ కల్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు భద్రాద్రి రామయ్య క్షేత్రానికి ఈ సారి భారీగా తరలిరానున్నారు.
Also Read : యూట్యూబ్ జర్నలిస్ట్ లను స్టేషన్లో చెడ్డీలపై నిలబెట్టిన పోలీసులు
గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో భక్తుల సందడి లేకుండానే సాగిన రాములోరి కల్యాణం.. ఈసారి అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 2న మొదలైన తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. సకల హంగులతో నిర్వహించే ఎదుర్కోలు మహోత్సవం.. సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేలా భద్రాద్రి దివ్వక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కల్యాణ మహోత్సవానికి ముందు రోజు నిర్వహించే ఎదుర్కోలు మహోత్సవానికి మిథిలా మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇవి కూడా చదవండి ..
- చైర్ పర్సన్ చీర లాగిన టీఆర్ఎస్ నేతలు.. కొత్తగూడెం జిల్లాలో రచ్చ
- తెలంగాణ సీఎస్‌పై వేటు? గవర్నర్ పంజా విసరబోతున్నారా?
- ప్రజలకు టీఎస్ఆర్టీసీ షాక్.. ఛార్జ్ ఐదు రూపాయలు హైక్
- జగన్ కేబినెట్ లో 10 మంది మంత్రులు సేఫ్?
- శ్రీశైలం భ్రమరాంభ అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ
One Comment