
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళి సై మధ్య వార్ జరుగుతోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన తమిళి సై కేంద్రం పెద్దలను కలిశారు. కేసీఆర్ సర్కార్ తీరుపై నివేదిక ఇచ్చారు. కేసీఆర్ టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు గవర్నర్ తమిళి సై. ఈ యుద్ధంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చిక్కుల్లో పడపోతున్నారని తెలుస్తోంది. కేసీఆర్ కు చెక్ చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం, బెంగాల్ ఫార్ములాను సిద్ధం చేస్తోంది. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉన్న వజ్రాయుద్ధాన్ని సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. గవర్నర్ తమిళి సై ప్రోటోకాల్ వివాదం ఢిల్లీ చేరిన నేపధ్యంలో, కేంద్ర ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై, ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని, అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read : యూట్యూబ్ జర్నలిస్ట్ లను స్టేషన్లో చెడ్డీలపై నిలబెట్టిన పోలీసులు
గతంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అలపన్ బంద్యోపధ్యాయ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్ల గీత దటి విధేయతను ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు. చివరకు ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటన సమయంలోనూ, మమతా బెనర్జీ ఆడించిన రాజకీయ క్రీడలో పావుగా మారి సమస్యలు కొని తెచ్చుకున్నారు. ఆయన రిటైర్మెంట్’కు రెండు రోజుల ముందు, కేంద్ర ప్రభుత్వ, డిపార్టుమెంటు అఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ – డీఓపీటీ, ఇచ్చిన ఎక్స్టెన్షన్ రద్దు చేసి రీకాల్ చేసింది. అయితే మమతా బెనర్జీ ఆయన్ని మూడేళ్ళ కాలానికి రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా నియమించారు. కానీ, ఇప్పటికీ కూడ ఆయన సర్వీస్ నిబంధనలకు సంబదించిన చిక్కుల నుంచి పూర్తిగా బయట పడలేదు.
సోమేశ్ కుమార్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అదే విధంగ వ్యవహరిస్తుందా, రీకాల్ చేస్తుందా అనే చర్చ అధికర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ను ఢిల్లీ పిలిపించిన సందర్భంలో గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను గమనిస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘనలను చాలా సీరియస్ తీసుకుందని, ముఖ్యంగా ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవహర సరళి పై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుగ ఆయన మెదడ వేతు వేస్తుందని అధికార వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి.
నిజానికి సోమేశ్ కుమార్, ఆంధ్రా క్యాడర్ అదికారి, కాబట్టి ఆయన్ని వెనక్కి పిలిపిలిపించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ముందస్తు అనుమతి కూడా అవసరం ఉండక పోవచ్చని అధికారులు అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం పై ప్రకటించిన రాజకీయ యుద్ధం చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై వేటుతో, మరో దశకు చేరుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి ..
- సీతారాముల కల్యాణానికి సిద్ధమైన భద్రాద్రి దివ్యక్షేత్రం
- చైర్ పర్సన్ చీర లాగిన టీఆర్ఎస్ నేతలు.. కొత్తగూడెం జిల్లాలో రచ్చ
- ప్రజలకు టీఎస్ఆర్టీసీ షాక్.. ఛార్జ్ ఐదు రూపాయలు హైక్
- జగన్ కేబినెట్ లో 10 మంది మంత్రులు సేఫ్?
- శ్రీశైలం భ్రమరాంభ అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ
2 Comments