Telangana

ఉస్మానియా హాస్పిటల్ పై నుంచి దూకి రోగి సూసైడ్.. కారణం వింటే షాకే?

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిలో విషాదకర ఘటన సంభవించింది. తనను ఆసుపత్రిలో మద్యం తాగొద్దన్నారనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ రోగి… ఆసుపత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన నాగరాజుగా గుర్తించారు.

అఫ్జల్ గంజ్ సీఐ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 2వ తేదీన నాగరాజు పురుగుల మందు తాగాడు. చికిత్స కొసం నాగరాజును భార్య సంతోష ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో, ఆసుపత్రిలోని కులీ కుతుబ్ షా భవనం నాలుగో అంతస్తులోని ఎంఎం2 వార్డులో నాగరాజు చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలోకి మద్యం తీసుకురావాలని భార్యను వేధించేవాడు. అయితే, మద్యం తాగొద్దని భార్య వారించడంతో, ఆమెను అక్కడ తోసేని వెళ్లిపోయాడు.

Also Read : డబ్బుల కోసం 90 సార్లు కొవిడ్ వ్యాక్సిన్!

కాసేపటి తర్వాత భవనం నాలుగో అంతస్తు కిటీకీ అద్దాలను పగులగొట్టి, అక్కడి నుంచి కిందకు దూకాడు. ఈ ఘటనలో ఆయన తలకు బలమైన గాయం అయి, అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, గత నాలుగు రోజులుగా మద్యం లేకపోవడంతో మానసికంగా కుంగిపోయాడని చెప్పారు.

ఇవి కూడా చదవండి ..

  1. జగన్ కు సీనియర్ మంత్రుల ఝలక్?
  2. భారత్‌లోకి కొవిడ్ కొత్త వేరియంట్.. మళ్లీ కల్లోలమేనా?
  3. ఆసక్తికరంగా ‘బరి’ ట్రైలర్..మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
  4. చట్టం వాళ్లకు చుట్టమా! ఓల్డ్ సిటీలో పోలీసులు డమ్మీలేనా?
  5. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు శ్రీరాం రాంచందర్‎కు ఘన సన్మానం

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.