
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు స్పష్టిస్తున్న రాడిసన్ బ్లూ పబ్ కేసులో సంచలన అంశాలు వెలుగులోనికి వస్తున్నాయి. మెగా డాటర్ నిహారిక, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సిద్ధార్థ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు.. ఇలా పలువురు ప్రముఖులు పోలీసులకు పట్టుబడ్డారు. ఏపీ మాజీ డీజీపీ కూతురు కూడా ఉన్నట్లు తేలింది. డ్రగ్స్ పార్టీ జరిగిన రాడిసన్ బ్లూ హోటల్ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూతురుది కావడం మరో సంచలనమైంది.
Also Read : డ్రగ్స్ దందాలో మాజీ ఎంపీ అల్లుడే కీ రోల్?
తాజాగా డ్రగ్స్ కేసు నిందితుల్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ3 నిందితుడిగా పోలీసులు నమోదు చేసిన అర్జున్ వీరమాచనేని..టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కూతురి అల్లుడిగా తేలింది. పబ్‌లో డ్రగ్స్ బయటపడిన నేపథ్యంలో సదరు డ్రగ్స్‌తో సంబంధం ఉందని భావించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో అభిలాష్, అనిల్ కుమార్ ను ఇప్పటికే రిమాండ్ లో చంచల్ గూడ జైలుకు తరలించారు. ఏ3 నిందితుడిగా ఉన్న అర్జున్ వీరమాచనేని గురించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అర్జున్ నందమూరి తారక రామారావు కూతురు అల్లుడు కావడం హాట్ టాపిక్ గా మారింది.
ఇవి కూడా చదవండి ..
- బీజేపీలోకి భిక్షమయ్య గౌడ్.. త్వరలో మరో కీలక నేత?
- మునుగోడు టీఆర్ఎస్ లో పీకే సర్వే కలకలం.. సొంత పార్టీ నేతలపై కూసుకుంట్ల అసహనం
- సోనియాతో టీడీపీ ఎంపీల భేటీ.. బాబుకు బీజేపీ హ్యాండిచ్చిందా?
- డ్రగ్స్ పార్టీలో రేవంత్‌రెడ్డి మేనల్లుడు!
- రాహుల్ ముందే రేవంత్ పై కోమటిరెడ్డి ఫైర్!