Telangana

బీజేపీలోకి భిక్షమయ్య గౌడ్.. త్వరలో మరో కీలక నేత?

క్రైమ్ మిర్రర్, యదాద్రి ప్రతినిధి : తెలంగాణ బీజేపీలోకి మళ్లీ వలసలు కొనసాగుతున్నాయి. ఉగాది రోజున బండి సంజయ్ చెప్పినట్లే కమలం పార్టీలో భారీ చేరికలు జరగబోతున్నాయి. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీజేపీలో చేరుతున్నట్లు ఆయన లేఖ విడుదల చేశారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కష్టాలు తీర్చేందుకు 2018లో టీఆర్ఎస్ లో చేరానని చెప్పారు భిక్షమయ్య గౌడ్. ఆలేరు అభివృద్ధిలో తనను భాగస్వామిగా చేస్తారని ఆశించానని తెలిపారు. అయితే జరిగింది మాత్రమే భిన్నంగా ఉందన్నారు. ఆలేరు ప్రజల నుంచి తనను వేరు చేసేందుకు కుట్ర చేశారని తెలిపారు. ఆలేరులో తిరగవద్దని, ప్రజలను కలవొద్దని టీఆర్ఎస్ పెద్దలు ఆదేశించారని భిక్షమయ్య గౌడ్ తన లేఖలో వివరించారు. మూడేళ్లుగా ఆలేరు ప్రజలను కలవకుండా కట్టడి చేశారని లేఖలో పేర్కొన్నారు బూడిద భిక్షమయ్య గౌడ్.

బూడిద బాటలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరికొందరు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇప్పటీకే బీజేపీ పెద్దలతో సదరు నేతలు మాట్లాడారని.. సమయం చూసుకుని పార్టీలో చేరడమే మిగిలి ఉందంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికకు రెండు, మూడు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ 14న అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. ఆయన సమక్షంలోనే కీలక నేతల కమలం ఎంట్రీ ఉంటుందంటున్నారు .
బీజేపీలోకి భిక్షమయ్య గౌడ్.. త్వరలో మరో కీలక నేత?

ఇవి కూడా చదవండి ..

  1. మునుగోడు టీఆర్ఎస్ లో పీకే సర్వే కలకలం.. సొంత పార్టీ నేతలపై కూసుకుంట్ల అసహనం
  2. డ్రగ్స్ హబ్ గా హైదరాబాద్? పోలీసుల కనుసన్నల్లోనే మత్తు మాఫియా?
  3. రాత్రి రాడిసన్ బ్లూ హోటల్‌ లో రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు అరెస్ట్..
  4. గవర్నర్ కు యాదాద్రిలో ఘోర అవమానం.. యాక్షన్ తప్పదా?
  5. రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం..

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.