Telangana

మునుగోడు టీఆర్ఎస్ లో పీకే సర్వే కలకలం.. సొంత పార్టీ నేతలపై కూసుకుంట్ల అసహనం

క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా ప్రతినిధి : నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి పీకే టీమ్ సీఎం కేసీఆర్ కు ఇచ్చిన సర్వే వివరాలతో క్రైమ్ మిర్రర్ ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది. నియోజకవర్గంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కూసుకుంట్ల పనితీరు బాగా లేదంటూ పీకే టీమ్ కేసీఆర్ కు సర్వే రిపోర్ట్ ఇచ్చిందన్న వార్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు జోరుగా చర్చించుకుంటున్నారు. క్రైమ్ మిర్రర్ లో వచ్చిన కథనం నూటికి నూరుపాళ్లు నిజమేనని చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలను మాజీ ఎమ్మెల్యే కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ప్రస్టేషన్ తో ఆయన సొంత పార్టీల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. తన పరిస్థితి బాగా లేదని గ్రహించిన కూసుకుంట్ల టీఆర్ఎస్ నేతలపై తన ప్రతాపం చూపిస్తున్నారట.

Also Read : డ్రగ్స్ హబ్ గా హైదరాబాద్? పోలీసుల కనుసన్నల్లోనే మత్తు మాఫియా?

ఉగాది సందర్భంగా నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు భారీగా ఫ్లెక్సీలు పెట్టారు. అయితే మర్రిగూడ మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ తన ఫ్లెక్సీలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఫోటో పెట్టుకున్నారు. దీంతో అసహనానికి లోనేన కూసుకుంట్ల.. మర్రిగూడ సర్పంచ్ కు ఫోన్ చేసి దుర్భాషలాడారని తెలుస్తోంది. ప్లెక్సీలో తన ప్రత్యర్థి అయిన కర్నె ఫోటోను ఎందుకు పెట్టావని నిలదీశాడట. తాను చెప్పినట్లు వినాలని, లేదంటే చుక్కలు చూపిస్తానని బెదిరించారట. దీంతో తన ఫ్లెక్సీపై మర్రిగూడ సర్పంచ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చుకున్నారు. ఉగాది రోజున పెట్టిన ఫ్లెక్సీకి తనకు సంబంధం లేదని చెప్పుకున్నారు. ఇలాంటి ఘటనలు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. 

Pk Trs : మునుగోడుపై పీకే టీమ్ రిపోర్ట్.. కొత్త నేతకే టికెట్?

మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడా కూసుకుంట్లకు పూర్తి పట్టులేదు. దాదాపుగా అన్ని మండలాల్లోనూ ఆయనకు వ్యతిరేక వర్గం బలంగా తయారైంది. చౌటుప్పల్ మండలానికి వస్తే ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి చాలా రోజులుగా కూసుకుంట్లను వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మెన్ రాజు కూడా కూసుకుంట్లకు మద్దతుగా నిలవడం లేదు. ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం కర్నెకు సపోర్ట్ చేస్తున్నారని టాక్. మునుగోడు మండల జడ్పీటీసీ భర్త నారబోయిన రవి కూడా కూసుకుంట్లకు వ్యతిరేకంగా బహిరంగగానే మాట్లాడుతున్నారు. కూసుకుంట్లతో సంబంధం లేకుండానే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. నారబోయినకు మంత్రి జగదీశ్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. చండూరు, నాంపల్లి మండలాల్లోనూ కూసుకుంట్లను స్థానిక గులాబీ నేతలు అస్సలు లెక్కచేయడం లేదని తెలుస్తోంది.

Read More : 60 మంది సిట్టింగులకు నో టికెట్.. కేసీఆర్ కు పీకే షాకింగ్ రిపోర్ట్..

నియోజకవర్గంలో రోజురోజుకు తన వ్యతిరేకులు పెరిగిపోతుండటం, పీకే సర్వేలోనూ వ్యతిరేక ఫలితాలు రావడాన్ని కూసుకుంట్ల తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. అందుకే ఇలా సొంత పార్టీ నేతలపై ఆసహనం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. కూసుకుంట్ల తీరు ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో ఆయనకు మరిన్ని కష్టాలు తప్పవనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలే ఆయనపై భగ్గుమంటున్నారు. సొంత పార్టీ నేతల ఫోటోలు పెడితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలతో మునుగోడు సీటు తనకు రాదని కూసుకుంట్లకు అర్ధమైందనే చర్చ సాగుతోంది.

ఇవి కూడా చదవండి ..

  1. రాత్రి రాడిసన్ బ్లూ హోటల్‌ లో రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు అరెస్ట్..
  2. గవర్నర్ కు యాదాద్రిలో ఘోర అవమానం.. యాక్షన్ తప్పదా?
  3. రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం..
  4. జిల్లాలో ‘పుష్ప’రాజ్‌లు.. చెట్లు నరికివేస్తున్నా చోద్యం చూస్తున్న అధికారులు.
  5. త్వరలో ఎస్సైజ్ శాఖలో పదోన్నోతులు మంత్రి శ్రీనివాస్ గౌడ్

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.