
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బంజారాహిల్స్లో నిన్న రాత్రి రాడిసన్ బ్లూ హోటల్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారం అందింది. అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ అధికారులు సడెన్ గా ఆ హోటల్ పై దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయ్యారు కొందరు సినీ ప్రముఖులు, అలాగే కొందరు ప్రముఖుల వారసులు. ఆ దాడుల్లో ప్రముఖ నటుడు, నిర్మాత కూతురు, ఓ నటి కుమార్తె, మరియు బిగ్ బాస్ తెలుగు విజేత – ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, అలాగే కొందరు బడా బాబుల పిల్లలు అడ్డంగా బుక్ అయ్యి.. నేటి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.
Also Read : అంకుర్ హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం.. బాబు మృతి.
పైగా ఈ దాడుల్లో భారీగా డ్రగ్స్ దొరికాయి. దీనికితోడు సమయానికి మించి పుడింగ్ మింక్ పబ్ నడుపుతున్నారు. దాంతో పబ్ యజమానులతో సహా 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పబ్ ఒక మాజీ ఎంపీ కూతురుది అని తెలుస్తోంది. అయితే, అరెస్టయిన వారిలో సినీ ప్రముఖులతో పాటు బడా బాబుల పిల్లలు కూడా ఉండటంతో పోలీసులు వివరాలు పూర్తిగా బయట పెట్టడం లేదు. తమ వివరాలు పూర్తిగా బయట పెట్టకపోయినా, పబ్లో టాస్క్ఫోర్స్ అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆ ప్రముఖుల వారసులు హడావుడి చేస్తూ హంగామా సృష్టించారు.
తమను ఎందుకు తీసుకువచ్చారంటూ గొడవకు దిగారు. విచారణ అనంతరం పోలీసులు కొందరిని విడిచిపెట్టారు. తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు దాడులు నిర్వహించడం.. ఉదయం 5 గంటల సమయంలో కొందర్ని విచారించి విడిచి పెట్టడం జరిగింది. అయితే.. అరెస్ట్ అయిన ప్రముఖుల్లో స్టార్ హీరోల బ్రదర్, నటుడు మరియు షోలకు జడ్జ్ అయిన ఓ ప్రముఖ వ్యక్తి కుమార్తె కూడా ఉందట. ఆమెకు ఇప్పటికే పెళ్లి అయ్యింది. ఆమెతో పాటు ఆమె భర్త కూడా ఈ పార్టీలో ఉన్నట్టు తెలుస్తోంది.
అలాగే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కుమార్తె కూడా ఈ పార్టీలో ఉంది. భర్తను పోగొట్టుకున్న తర్వాత ఆ నటి తన కుమార్తెతో కలిసి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె కూతురికి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఇలా రేవ్ పార్టీలో బుక్ అవ్వడం బాధాకరం.
ఇవి కూడా చదవండి..
- గవర్నర్ కు యాదాద్రిలో ఘోర అవమానం.. యాక్షన్ తప్పదా?
- రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం..
- జిల్లాలో ‘పుష్ప’రాజ్లు.. చెట్లు నరికివేస్తున్నా చోద్యం చూస్తున్న అధికారులు.
- త్వరలో ఎస్సైజ్ శాఖలో పదోన్నోతులు మంత్రి శ్రీనివాస్ గౌడ్
- టీనా చౌదరికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సత్కారం
2 Comments