
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆరోగ్యంగా ఉన్న బాబుతో ఆసుపత్రికి వస్తే శవంగా బాబును ఇచ్చారు. బాబు తండ్రి ప్రేమకుమార్ తెలిపిన ప్రకారం కేవలం డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మా బాబు చనిపోవడం జరిగింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లోని అంకుర హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. నిన్న గురువారం మిర్యాలగూడ కు చెందిన ప్రేమ్ కుమార్ స్పందన దంపతుల 16 రోజుల బాబును చికిత్స నిమిత్తం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లోని అంకుర హాస్పిటల్ కు తీసుకు రావడం జరిగింది.
అయితే బాబుకి లివర్ కింద చిన్న గాలి బుడగ ఉందని ఆపరేషన్ చేసి తీసి వేస్తామని డాక్టర్లు తెలపడం జరిగింది. అయితే ఆపరేషన్ గురించి వాకబు చేసిన తల్లిదండ్రులకి అంకుర హాస్పిటల్ డాక్టర్ ఇది చాలా చిన్న ఆపరేషన్ అని దీని ద్వారా ఎలాంటి ప్రాణహాని ఉండదని స్పష్టం చేశారని బాబు తండ్రి తెలిపారు.
కానీ వారు చెప్పిన దానికి చేసిన దానికి ఏమాత్రం పొంతన లేదని బాబుని మృత శరీరంగా తమకు అప్పగించారని పోలీసులు వచ్చాక ఎన్నో కొత్త కథనాల కి తెరలేపి ఒక నాటకం మాదిరిగా ఆడుతున్నారని ఈ ఆపరేషన్ చాలా కరెక్ట్ కాదని బాబు చనిపోవచ్చు అని కూడా మేము తెలిపామని డాక్టర్స్ అబద్ధాలు చెబుతున్నారని తమకు సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాకు జరిగిన అన్యాయం భవిష్యత్తులో ఎవరికి జరగకూడదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి ..
- పవన్ పార్టీ బీజేపీలో విలీనం!
- ఎలుకలు కొరికిన శ్రీనివాస్ మృతి.. వరంగల్ ఎంజీఎంలో కలకలం
- పవిత్రమైన వృత్తిలో ఉంటూ పాడు పనిచేసిన డాక్టర్
- కేబినెట్ లోకి తమ్మినేని.. స్పీకర్ గా ధర్మాన?
- కరెంట్ ఛార్జీలపై కూకట్ పల్లిలో బీజేపీ ధర్నా
- కేసీఆర్ పై ఆర్జీవీ బయోపిక్.. రచ్చరచ్చేనా?
- ఎల్బీనగర్ నుంచి బండి సంజయ్ పోటీ!
3 Comments